కళ్యాణదుర్గం ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై టిడిపిలో చేరిన సూర్య నాయక్.
కళ్యాణదుర్గం: నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ప్రజాదరణ పెరుగుతోందని, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఐపార్సపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సూర్య నాయక్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సమక్షంలో ప్రజావేదిక వద్ద టీడీపీ కండువా కప్పుకొని పార్టీలో చేరగా, ఎమ్మెల్యే ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సూర్య నాయక్ మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగినప్పటికీ తమ ప్రాంతంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసినా గ్రామంలో మౌలిక సదుపాయాలు, ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిస్థాయిలో అందలేదని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించి ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించగల నాయకత్వం అవసరమని, ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నాయకత్వంపైనే తమకు నమ్మకం ఉందని తెలిపారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తున్న విధానం తనను ఎంతగానో ఆకర్షించిందన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఆయన చూపుతున్న చొరవ, ప్రజా సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యత తమను తెలుగుదేశం పార్టీ వైపు నడిపించాయని వివరించారు. తమ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నాయకత్వంతోనే సాధ్యమని విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకే సుదీర్ఘకాలంగా కొనసాగిన వైసీపీ అనుబంధాన్ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని, పార్టీ విజయానికి తన వంతు సహకారం అందిస్తానని సూర్య నాయక్ స్పష్టం చేశారు. గ్రామంలో మరింత మంది యువత, నాయకులు, కార్యకర్తలను టీడీపీ వైపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు హైపర్స్ పల్లి రఘు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.