BREAKING
ధర్మసాగర్ లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి నిరుపేద నాయీ బ్రాహ్మణులకు ఇంటి స్థలాలు ఇప్పించండి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి వినతి కార్పొరేటర్ నాగభూషణం దంపతులకు సన్మానం 19 న రూరల్ కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక అదే రోజు న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ల ఎన్నిక

తీన్మార్ మల్లన్న కారు ప్రమాదంపై అనుమానాలు

Select Suryaa Now
తీన్మార్ మల్లన్న కారు ప్రమాదంపై అనుమానాలు

 

ఫరూఖ్ నగర్ రంగారెడ్డి :తీన్మార్ మల్లన్న కారును లారీ ఢీకొనడంలో పలు అనుమానాలు ఉన్నాయని   ఈ ఘటన పై  హైకోర్టు సిట్టింగ్ విచారణను జరిపి నిజానిజాలను తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నట్లు టీఆర్పీ షాద్‌నగర్ ఇన్‌చార్జ్ ఎమ్మె సంతోష్ పేర్కొన్నారు.

షాద్‌నగర్‌లోని టీఆర్పీ కార్యాలయంలో షాద్‌నగర్ నియోజకవర్గ అధ్యక్షులు ఎమ్మె సంతోష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ డిమాండ్ చేశారు.

తీన్మార్ మల్లన్న మహా పాదయాత్ర మోత్కూర్ నుంచి తిరుమలగిరి వెళ్తున్న తరుణంలో అనాజీపూర్ వద్ద అతివేగంగా వస్తున్న లారీ తీన్మార్ మల్లన్న ప్రయాణిస్తున్న ఫార్చ్యునర్ కారును వెనుక నుంచి ఢీకొంది. అలాగే ముందు మరో షిఫ్ట్ కారును కూడా ఢీకొంది. ఆ రెండు కార్లలో ఉన్న వ్యక్తులకు గాయాలతో పరిస్థితి విషమంగా ఉంది.

అతివేగంగా ఉన్న లారీ అదుపుతప్పి అక్కడ పాదయాత్ర చేస్తున్న తీన్మార్ మల్లన్న మరియు టీఆర్పీ నాయకులు, కార్యకర్తలపైకి వెళ్తే వందల సంఖ్యలో దుర్మరణాలు ఉండే పరిస్థితి ఉందని అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ లారీ దిగి ఒక నల్లటి ఫార్చ్యునర్ కారులో పారిపోయినట్లుగా అక్కడి స్థానికులు మరియు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని చెప్పారు.

కావున ఈ ప్రమాదంపై అనేక అనుమానాలు మరియు కుట్రలు ఉన్న కారణంగా ఈ ప్రమాదాన్ని వీలైనంత వెంటనే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిజ నిజాలు తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అదేవిధంగా ఈరోజు తీన్మార్ మల్లన్నకి ఏదైనా ప్రమాదం జరిగితే రాష్ట్రంలో ఉన్న బీసీలు ఆగ్రహానికి గురికావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, కనుక ఇప్పటికైనా పాదయాత్రకు, తీన్మార్ మల్లన్నకి రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ నియోజకవర్గ అధ్యక్షులు ఎమ్మె సంతోష్, మహిళా అధ్యక్షురాలు గుల్ల లక్ష్మి, ఉపాధ్యక్షులు మీదికే రాధాకృష్ణ, గుంటి శంకర్, ఉపాధ్యక్షురాలు యాదమ్మ, జిల్లా నాయకులు గుల్ల శ్రీనివాస్, షాద్‌నగర్ మున్సిపాలిటీ అధ్యక్షులు ఉప్పరమొని రాములు, యాదగిరి, గోపాల్, హరిప్రసాద్, వడ్డే శంకర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

నరసింహ రెడ్డి మేజర్ న్యూస్