telangana
శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ ఆలయ వద్ద మహా యజ్ఞం
సూర్య రెంజల్ : శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ ఆలయ ఆరవ వార్షికోత్సవం సందర్భంగా మహా యజ్ఞ హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు.మండల కేంద్రంలో గ్రామ దేవత అయినటువంటి శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి ఉదయం నుండి అభిషేకాలు, పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య మహా యజ్ఞం హోమ కార్యక్రమాన్ని చేపట్టారు. యజ్ఞ హోమం కార్యక్రమాన్ని నిర్వహించి పూర్ణాహుతి తో సమాప్తం చేపట్టారు. ఈనెల 22వ తేదీన అమ్మవారికి బోనాల పండుగను నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీని నిర్వాకులు తెలిపారు. ముత్యాలమ్మ ఆలయానికి గ్రామ పెద్దలు, సర్పంచ్ చీర సారెను అందజేశారు. కొరకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముత్యాలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు మదన్, నిర్వాహకులు, సభ్యులు, దంపతులు, మహిళలు భక్తులు పాల్గొన్నారు.