BREAKING
పోటీ నుంచి తప్పుకున్న రాంజీ యశ్ రాజ్ ఫిల్మ్స్ తొలి హారర్ చిత్రంలో వరుణ్ ధావన్.. దర్శకత్వం ఎవరిదంటే? రెండు ద్విచక్ర వాహనాలు డి... ఒకరు మృతి న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌కు గుర్నూర్ బ్రార్ ఎంపిక.. కుల్దీప్ యాదవ్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం సాండ్‌పేపర్ వివాదంపై డేవిడ్ వార్నర్ సంచలన ఆరోపణలు.. స్టార్క్, లయన్, హేజిల్‌వుడ్‌లను విచారించలేదంటూ క్రికెట్ ఆస్ట్రేలియాపై ఫైర్ 10వ తరగతి ఫలితాలు పై ప్రత్యేక దృష్టి టీ20 ఫార్మాట్‌లో వ్యూహాత్మక మార్పులే కీలకం.. కర్ణాటక యువ బ్యాటర్ స్మరన్ రవిచంద్రన్ ఆసక్తికర వ్యాఖ్యలు దివ్య కుటుంబానికి అండగా ఉంగుటూరు ఎమ్మెల్యే, జనసేన నాయకులు యాదవోలులో కేంద్ర బృందం పర్యటన ఘనముగా గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం ఆర్థిక ప్రమాదాలను నివారించడానికి క్రమమైన వడ్డీ రేట్ల పెంపే ఉత్తమం జెన్సన్ హువాంగ్ లేకపోతే కీలక ఒప్పందాలను కోల్పోనున్న ఎన్విడియా 73 ఏళ్ల నిరీక్షనకు తెరదించుతూ న్యూజిలాండ్‌పై అద్భుత విజయం సాధించిన వేల్స్ జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి అమెరికాలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం

సెయింట్ ఆంథోనీ పాఠశాలలో వైభవంగా బాలల దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
సెయింట్ ఆంథోనీ పాఠశాలలో వైభవంగా బాలల దినోత్సవ వేడుకలు

సదాశివపేట;పట్టణంలోని సెయింట్ ఆంథోనీస్ పాఠశాలలో నవంబర్ 14న బాలల దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన ఈ వేడుకలకు పాఠశాల చైర్మన్ ఇ. ఆంటోనీ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆంటోనీ రెడ్డి మాట్లాడుతూ.. బాలల దినోత్సవ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. నేటి బాలలే రేపటి పౌరులని, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. విలువైన విషయాలను తెలియజేస్తూ విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు.వేడుకల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. చిన్నారులు ప్రదర్శించిన వివిధ రకాల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రాంగణం విద్యార్థుల ఆటపాటలు, కేరింతలతో సందడిగా మారింది.అనంతరం విద్యార్థుల ప్రతిభను పాఠశాల ప్రిన్సిపల్ అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతను పెంపొందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాలల దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.