BREAKING
కడియంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం గోపాలపురంలో కేంద్ర బృందం పర్యటన రిటర్నింగ్‌ అధికారులకు ఆన్‌లైన్‌ ప్రక్రియపై అవగాహన బాలీవుడ్ తారలకు కొత్త భద్రతా వలయం.. ఆరు నుంచి ఏడుగురు సిబ్బందితో బందోబస్తు మొక్కజొన్న సాగులో మెలకువలపై శిక్షణ దీపావళి వేడుకలకు వెళ్లలేకపోయిన రిషి కపూర్.. అత్తగారు కవర్ చింపేసిన ఆసక్తికర ఘటన గుర్తుచేసుకున్న నీతూ కపూర్ సిద్దిపేట సభ ఏర్పాట్ల సమావేశంలో కాట శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు సర్పంచ్ ఎన్నికల వేడి.. సీట్ల కోసం కూటమిలో కుమ్ములాటలు! ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సీనియర్ నటుడు, దర్శకుడు టిన్ను ఆనంద్.. ఆరోగ్యంపై అప్‌డేట్ నాకు నచ్చిన పాత్రలు దొరకడం ఇప్పటికీ సవాలే.. సరైన అవకాశం కోసం వేచి చూస్తా: అదితి రావు హైదరి పోటీ నుంచి తప్పుకున్న రాంజీ యశ్ రాజ్ ఫిల్మ్స్ తొలి హారర్ చిత్రంలో వరుణ్ ధావన్.. దర్శకత్వం ఎవరిదంటే? రెండు ద్విచక్ర వాహనాలు డి... ఒకరు మృతి న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌కు గుర్నూర్ బ్రార్ ఎంపిక.. కుల్దీప్ యాదవ్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం

పోటీ నుంచి తప్పుకున్న రాంజీ

Select Suryaa Now
పోటీ నుంచి తప్పుకున్న రాంజీ

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంకడియం మండలం కడియపులంక గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల రాజకీయం కీలక మలుపు తిరిగింది. సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న గట్టు నరసయ్యకు మాజీ ఉపసర్పంచ్ పాఠంశెట్టి రాంజీ మద్దతు ప్రకటించారు. దీంతో గ్రామంలో ఎన్నికల సమీకరణాలు మారుతున్నాయి.

మొదటి నుంచి సర్పంచ్ పదవికి పోటీ చేస్తానని ప్రకటిస్తూ వచ్చిన రాంజీ, తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుని ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. నరసయ్యకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఆయనకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు.

వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు తెలిసింది. నరసయ్యకు మద్దతుగా నిలవాలని రాంజీకి ఎమ్మెల్యే సూచించడంతో ఇరువర్గాల మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ ప్రక్రియలో కూటమి నాయకులు బోడపాటి గోపి తదితరులు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.వారి సమక్షంలో ఇరువర్గాల మధ్య సయోధ్య కుదరడంతో రాంజీ పోటీ నుంచి తప్పుకుని నరసయ్యకు మద్దతు ప్రకటించారు. ఇప్పటికే గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన నరసయ్యకు రాంజీ మద్దతు తోడవడంతో కడియపులంక రాజకీయాల్లో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇప్పటివరకు విడివిడిగా సాగిన రాజకీయ ప్రయత్నాలు ఒక్కటవడంతో కడియపులంక సర్పంచ్ ఎన్నికల బరిలో కొత్త సమీకరణాలు తెరపైకి వచ్చాయి. మిగిలిన అభ్యర్థుల ప్రచార వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయన్నది గ్రామంలో ఆసక్తికర చర్చగా మారింది.