BREAKING
జాతీయ స్థాయి పోస్టర్ ప్రజెంటేషన్ పోటీల్లో మోడల్ స్కూల్ విద్యార్థినుల ప్రతిభ.. నామినేషన్ కేంద్రాలను సందర్శించిన కాశీబుగ్గ ఎస్‌హెచ్‌ఓ. బాలల దినోత్సవ వేడుకల్లో నెహ్రూకు ఘన నివాళి మై వాపస్ ఆఊంగా చిత్రంపై ఇంతియాజ్ అలీ ప్రత్యేక దృష్టి.. సినీ ప్రియుల్లో పెరుగుతున్న ఆసక్తి పంచాయతీ ఎన్నికల నామినేషన్, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్సై జి. నరేష్ కడియపులంక సర్పంచ్ బరిలో కీలక పరిణామం.. పోటీ నుంచి తప్పుకున్న రాంజీ తల్లిదండ్రులు షర్మిలా ఠాగూర్, టైగర్ పటౌడీ బాల్య ఫొటోలను పంచుకున్న సోహా అలీ ఖాన్.. నెహ్రూతో అరుదైన చిత్రాలు కడియంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం గోపాలపురంలో కేంద్ర బృందం పర్యటన రిటర్నింగ్‌ అధికారులకు ఆన్‌లైన్‌ ప్రక్రియపై అవగాహన బాలీవుడ్ తారలకు కొత్త భద్రతా వలయం.. ఆరు నుంచి ఏడుగురు సిబ్బందితో బందోబస్తు మొక్కజొన్న సాగులో మెలకువలపై శిక్షణ దీపావళి వేడుకలకు వెళ్లలేకపోయిన రిషి కపూర్.. అత్తగారు కవర్ చింపేసిన ఆసక్తికర ఘటన గుర్తుచేసుకున్న నీతూ కపూర్ సిద్దిపేట సభ ఏర్పాట్ల సమావేశంలో కాట శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

సర్పంచ్ ఎన్నికల వేడి.. సీట్ల కోసం కూటమిలో కుమ్ములాటలు!

Select Suryaa Now
సర్పంచ్ ఎన్నికల వేడి.. సీట్ల కోసం కూటమిలో కుమ్ములాటలు!

                      ఊపుమీదున్న కూటమి.. గ్రామాల్లో ఆశావహుల మధ్య ఆధిపత్య పోరు

                                పొడగట్లపల్లి, గోపాలపురం, ఈతకోటలో హోరాహోరీ పోటీ.. 

                                రావులపాలెంలో ఖర్చు భారం భయంతో అభ్యర్థుల వెనకడుగు

రావులపాలెం:మేజర్ న్యూస్ :గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. మండలంలో కూటమి రాజకీయంగా ఊపుమీదున్నప్పటికీ, సర్పంచ్ స్థానాల కోసం కూటమి పార్టీల్లోనే అంతర్గత పోరు మొదలైంది. ముఖ్యంగా పొడగట్లపల్లి, గోపాలపురం, ఈతకోట గ్రామాల్లో ఆశావహుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.పొడగట్లపల్లిలో టీడీపీ అంతర్గతంగా రెండు సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరు రసవత్తరంగా మారింది. గోపాలపురంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు రెండు పార్టీల తరఫున పోటీకి సిద్ధమవుతుండటంతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.లక్ష్మీపొలవరంలో ఒకే పార్టీలో సర్పంచ్ పదవిని ఆశించి భంగపడిన నాయకులు ఇప్పుడు ఏ వైపు అడుగులు వేస్తారన్న చర్చ గ్రామంలో జోరుగా సాగుతోంది. మరోవైపు రావులపాలెంలో ఎన్నికల ఖర్చు భారం కారణంగా కొందరు ఆశావహులు పోటీకి వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.