BREAKING
పెరిగిన బియ్యం ధరలను తక్షణమే అదుపు చేయాలి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి నేడు ప్రజావాణి కార్యక్రమం విప్పమనుపట్టెడ సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి గ్రామస్థుడి ఫిర్యాదు అమెరికాలో మూడో రోజు కొనసాగుతున్న విమాన ప్రయాణాల అంతరాయం విజ్ఞాన సమాజమే దేశ అభివృద్ధికి పునాది రష్యా కుట్రల నేపథ్యంలో డిసెంబర్ 1 నుండి సరిహద్దులను మూసివేయనున్న ఎస్టోనియా 16న పిల్లల ప్రజావాణి సింగపూర్, మలేషియా దేశాలకు క్షమాపణలు తెలిపిన ఇండోనేషియా అధ్యక్షుడు బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షులుగా గూట్ల తిరుపతి హూతీ వ్యతిరేక బలగాల వెనుకంజ, బహ్రెయిన్‌పై ఇరాన్ దాడుల కలకలం అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రొంపిచెర్ల సర్పంచ్ బరిలో షేక్ షబానా ఆజ్మీ. మంత్రి సీతక్కకు స్వాగతం పలికిన ఇనగాల మర్రిపాడు .సి .లో పోలీసులు పల్లెనిద్ర

దివ్య కుటుంబానికి అండగా ఉంగుటూరు ఎమ్మెల్యే, జనసేన నాయకులు

Select Suryaa Now
దివ్య కుటుంబానికి అండగా ఉంగుటూరు ఎమ్మెల్యే, జనసేన నాయకులు

                      ₹2.15 లక్షల ఆర్థిక సాయం, నిత్యావసర సరుకుల అందజేత

దేవరపల్లి, నవంబర్ 14 మేజర్ న్యూస్:దేవరపల్లి మండలం దుమంతునిగూడెం గ్రామానికి చెందిన జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి, అకాల మరణం పొందిన స్వర్గీయ శ్రీమతి గారపాటి దివ్య కుటుంబానికి జనసేన నాయకులు, ప్రజాప్రతినిధులు అండగా నిలిచారు. శనివారం గ్రామానికి విచ్చేసిన నాయకులు దివ్య కుటుంబ సభ్యులను పరామర్శించి,  ₹2,15,000 ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు.
ఈ సందర్భంగా దివ్య కుటుంబాన్ని ఆదుకునేందుకు ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు  ఉదారత చాటుతూ లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే, గ్రామానికి విచ్చేసి కుటుంబ సభ్యులను ఓదార్చిన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ  వ్యక్తిగతంగా ₹10,000 ఆర్థిక సాయం అందజేశారు.
గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జ్  దొడ్డిగర్ల సువర్ణరాజు ఆధ్వర్యంలో నల్లజర్ల మండల జెడ్పీటీసీ కవులూరి సత్తిబాబు  దేవరపల్లి మండల జనసేన నాయకులు, జనసైనికులు కలిసి పార్టీ తరఫున ₹55,000 ఆర్థిక సహాయం అందించారు. వీటికి అదనంగా దుమంతునిగూడెం గ్రామ పార్టీ అధ్యక్షులు గుడిసె పోసిబాబు  ₹20,000, నాయకులు పల్లంట్ల పాండు ₹10,000, అనిసెట్టి ఆదిత్య ₹10,000, అయినాల  నరసింహమూర్తి  ₹10,000 చొప్పున మొత్తం ₹50,000 గ్రామం తరఫున అందజేశారు.
మరోవైపు నల్లజర్ల మండల జనసేన నాయకులు, జనసైనికులు మండలవ్యాప్తంగా విరాళాలు సేకరించి రెండు బస్తాల బియ్యంతో పాటు ఇంటికి అవసరమైన నిత్యావసర సరుకులు, చిన్నపిల్లలకు దుస్తులు, ఇతర సామగ్రిని దివ్య కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కష్ట సమయంలో దివ్య కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నాయకులు భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో   జనసేన మండల పార్టీ అధ్యక్షులు కాట్నం గణేష్, దేవరపల్లి ఎంపీటీసీ-2 ఆకుల వీర్రాజు, వీర మహిళలు సెంథిల్ కుమారి, తలారి సౌజన్య, సత్య, రుద్ర శ్రీను, గుడిసె శివకృష్ణ, పోసి వెంకటరత్నం,  సుందరరావు, రాంబాబు, లక్ష్మణ్ తదితర జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.