జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి
పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి చంద్రగిరి మండలం పన పాకం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. టిప్పర్ను సుమో వెనకవైపు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది సుమోల ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కూతురిలో ఒక మహిళ డ్రైవర్ తో పాటు మరో వృద్ధుడు మృతి చెందారు. సింగిల్ రోడ్లు ప్రమాదం జరగడంతో రాత్రిపూట వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం చేరుకుని మృతుల వివరాలు తెలుసుకున్నారు గాయపడిన వారిని అంబులెన్స్ ద్వారా తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. చంద్రగిరి పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
మేజర్ న్యూస్, చంద్రగిరి