BREAKING
దివ్య కుటుంబానికి అండగా ఉంగుటూరు ఎమ్మెల్యే, జనసేన నాయకులు యాదవోలులో కేంద్ర బృందం పర్యటన ఘనముగా గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం ఆర్థిక ప్రమాదాలను నివారించడానికి క్రమమైన వడ్డీ రేట్ల పెంపే ఉత్తమం జెన్సన్ హువాంగ్ లేకపోతే కీలక ఒప్పందాలను కోల్పోనున్న ఎన్విడియా 73 ఏళ్ల నిరీక్షనకు తెరదించుతూ న్యూజిలాండ్‌పై అద్భుత విజయం సాధించిన వేల్స్ జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి అమెరికాలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం 1998 తర్వాత తొలిసారిగా అలాస్కాలో గెలుపొందిన డెమొక్రాటిక్ గవర్నర్ స్పేస్‌ఎక్స్ ఇంటర్నెట్ స్పీడ్ పరిమితులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర ఆగ్రహం జిల్లా ఆసుపత్రిలో డబ్బులు అడిగితే ఫోన్ చేయండి – ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కొండ శ్రీధర్ నశా ముక్త్ భారత్ బ్లాక్ స్థాయి క్రీడలు విజయవంతం న్యాయవాద పరిషత్‌ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్త సేవల అంతరాయంపై ట్రంప్ అధికారి వ్యంగ్యాస్త్రాలు: H-1B వీసా నియామకాలను ప్రస్తావిస్తూ విమర్శ నిరుద్యోగ మహిళలకు భరోసా -ఈ నెల 22న పెద్దపల్లిలో మహిళ ‘మెగా జాబ్ మేళా’

యాదవోలులో కేంద్ర బృందం పర్యటన

Select Suryaa Now
యాదవోలులో కేంద్ర బృందం పర్యటన

                                   మురుసు తుఫాను పంట నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన

దేవరపల్లి, నవంబర్ 14 మేజర్ న్యూస్ :మురుసు తుఫాను కారణంగా జరిగిన పంట, ఆస్తి నష్టాలను క్షేత్రస్థాయిలో అంచనా వేసేందుకు అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం శనివారం దేవరపల్లి మండలం యాదవోలు గ్రామంలో పర్యటించింది.ఈ సందర్భంగా కేంద్ర బృందం సభ్యులు తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను, వ్యవసాయ భూములను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం స్థానిక రైతులతో ముఖాముఖి మాట్లాడి పంటల స్థితిగతులు, జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తుఫాను వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వ్యవసాయ రంగానికి జరిగిన నష్టాన్ని రైతులు కేంద్ర బృందం దృష్టికి తీసుకువచ్చారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించిన అనంతరం నష్టానికి సంబంధించిన వివరాలను కేంద్ర బృందం సభ్యులు నమోదు చేసుకున్నారు. ఈ పర్యటనలో సంబంధిత జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొని తుఫాను నష్టంపై పూర్తి సమాచారాన్ని బృందానికి వివరించారు.