BREAKING
పోటీ నుంచి తప్పుకున్న రాంజీ యశ్ రాజ్ ఫిల్మ్స్ తొలి హారర్ చిత్రంలో వరుణ్ ధావన్.. దర్శకత్వం ఎవరిదంటే? రెండు ద్విచక్ర వాహనాలు డి... ఒకరు మృతి న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌కు గుర్నూర్ బ్రార్ ఎంపిక.. కుల్దీప్ యాదవ్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం సాండ్‌పేపర్ వివాదంపై డేవిడ్ వార్నర్ సంచలన ఆరోపణలు.. స్టార్క్, లయన్, హేజిల్‌వుడ్‌లను విచారించలేదంటూ క్రికెట్ ఆస్ట్రేలియాపై ఫైర్ 10వ తరగతి ఫలితాలు పై ప్రత్యేక దృష్టి టీ20 ఫార్మాట్‌లో వ్యూహాత్మక మార్పులే కీలకం.. కర్ణాటక యువ బ్యాటర్ స్మరన్ రవిచంద్రన్ ఆసక్తికర వ్యాఖ్యలు దివ్య కుటుంబానికి అండగా ఉంగుటూరు ఎమ్మెల్యే, జనసేన నాయకులు యాదవోలులో కేంద్ర బృందం పర్యటన ఘనముగా గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం ఆర్థిక ప్రమాదాలను నివారించడానికి క్రమమైన వడ్డీ రేట్ల పెంపే ఉత్తమం జెన్సన్ హువాంగ్ లేకపోతే కీలక ఒప్పందాలను కోల్పోనున్న ఎన్విడియా 73 ఏళ్ల నిరీక్షనకు తెరదించుతూ న్యూజిలాండ్‌పై అద్భుత విజయం సాధించిన వేల్స్ జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి అమెరికాలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం

సెయింట్ ఆన్స్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
సెయింట్ ఆన్స్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

సంగారెడ్డి;బాలలే దేశ భవిష్యత్తు.. వారి చిరునవ్వులే రేపటి సమాజానికి ఆశాకిరణాలని చాటిచెబుతూ సంగారెడ్డిలోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించే లక్ష్యంతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, పాటలు, ప్రసంగాలు నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన ప్రతిభాపాటవాలు, కళా ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.అనంతరం విద్యార్థులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి, విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. ప్రతి బాల్యం అద్భుతమైన భవిష్యత్తుకు పునాది అని, ప్రతి చిన్నారిలోనూ అపారమైన ప్రతిభ దాగి ఉంటుందని అన్నారు. ఆ ప్రతిభను వెలికితీసేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తగిన ప్రోత్సాహం అందించాలని సూచించారు. విద్యతో పాటు సంస్కారం, క్రమశిక్షణ, మానవీయ విలువలను నేర్పించడం ద్వారా పిల్లలను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు.వేడుకలను విజయవంతంగా నిర్వహించిన పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బందిని పాఠశాల కరస్పాండెంట్ కె. ఆంథోనీ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.