సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి భక్తుల విరాళం
సూర్య- బిక్కనూర్ : మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం మండలంలోని మోటాట్ పల్లి గ్రామానికి చెందిన భీమరి రచన 11 వేల రూపాయల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా రచన తండ్రి వెంకటేష్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో తమ వంతుగా భాగస్వామ్యం కావడం తమ అదృష్టమని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మద్ది సూర్యకాంత్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు తక్కల్ల నర్సారెడ్డి, సింగిల్ విండో సొసైటీ మాజీ అధ్యక్షుడు నాగర్తి భూమ్ రెడ్డి, సిద్ది రామేశ్వర ఆలయ కమిటీ సభ్యుడు రమేష్ రెడ్డి, సభ్యులు చంద్రశేఖర్, తక్కల్ల నితీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.