సర్టిఫికెట్లు ఇప్పించండి ముఖ్యమంత్రి గారూ.విద్యార్థుల ప్రదర్శనలో ఎంపీ ఆర్.కృష్ణయ్య
సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః ఫీజుల బకాయిలు 8500 కోట్లు విడుదల చేసి మా సర్టిఫికెట్లు ఇప్పించండి! ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి. మా బి.సి ఎస్సీ, ఎస్టీ లు చదువు కోవద్దా! ముఖ్యమంత్రి గారు అంటూ నినాదాలు చేస్తూ నేడు అబిడ్స్ నుండి బపీర బమ్ చౌరస్తా వరకు నిర్వహించిన భారీ ప్రదర్శన రాష్ట్ర బి.సి విద్యార్ధుల సంఘం కన్వీనర్ నిఖిల్ పటేల్ నాయకత్వం నిర్వహిందారు. రాష్ట్ర బి.సి విద్యార్థి ఫెడరేషన్ అధ్యకులు పర్లగోర్ల మోడీ రాందేవ్ సమన్వయం చేశారు. కోర్సు పూర్తి చేసి ఉన్నత విద్యా తరగతులు చదువుదామని వెళ్తున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వక ప్రభుత్వం ఫీజు చెల్లించకపోవడంతో 4 లక్షల మంది విద్యార్థులు సర్టిఫికెట్లు లేక ఉన్నత విద్యాను కోల్పోతున్నారు. ముఖ్యమంత్రికి విద్యార్థుల భవిష్యత్ కంటే ఢిల్లీ పర్యటనలు మరియు హైకమాండ్ కు రక్షణ కల్పించడం ఎక్కువ అయ్యిందా? విద్యార్ధుల ఆర్తనాదాలు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ భారీ ప్రదర్శన ని ఉద్దేశించి జాతీయ బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి బడ్జెటు ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. కానీ ఇంత వరకు విడుదల చేయలేదు. బడ్జెటు విడుదల చేయకపోవడంతో విద్యార్ధులు నరకయాతన అనుభావిస్తున్నరన్నారు. ఫీజుల బకాయిలు చెల్లిస్తే కాలేజి యాజమాన్యాలు తీసుకుంటారు. తప్ప విద్యార్ధులకు ఇవ్వమని అధికారులు చేస్తున్న వాదన సరికాదు. ఫీజులు మంజూరు చేసిన తరువాత ప్రభుత్వమే ప్రతి విద్యార్థికి మెస్సేజ్ పెట్టాలి. రైతు బందు రైతులకు మంజూరు చేసినట్లు విద్యార్ధులకు వారికి మంజురైనా వివరాలు తెలుపు ప్రతి విద్యార్ధికి మెస్సేజ్ ఇవ్వాలని సూచిస్తున్నాం. పైగా ఇంకా చాల మంది విద్యార్ధులు ఫీజులు చెల్లించక పోవడంతో సర్టిఫికెట్లు కాలేజిలలోనే యున్నవి. కొందరు అప్పులు చేసి తీసుకున్న మంజూరు చేసిన తర్వాత మెస్సేజ్ చూసిన తర్వాత వచ్చి కాలేజీలలో వసూలు చేసుకుంటారు. కాలేజి యాజమాన్యాలే స్వాహా చేస్తారానే ఉహ జనితమైన ఆలోచన. ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకున్న వారు 30-40 శాతం యుంటారు. మిగతా 60 - 70 శాతం మంది సర్టిఫికెట్లు కాలేజీలలో యున్నవి. కావున బకాయిలు ఇవ్వక తప్పదు. విద్యార్థులు ఫీజులు కట్టి స్తోమత లేని వారి కోసం ఈ స్కీమును పెట్టిందాం, స్కీముపై ఆధారపడి ఉచిత విద్య లభిస్తుందని చదువుకోవడానికి లక్షలాది మంది ఉన్న విద్యా కోర్సులు చదవడానికి ముందుకు వస్తున్నారు. ఈ ఫీజ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు అష్ట కష్టాల పాలవుతున్నారు. ఈ ఫీజులు కట్టాలని కాలేజీ విద్యార్థులపై యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నారు. కోర్సు పూర్తయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. పరీక్షా సమయంలో హాల్ టికెట్లు ఇవ్వడం లేదు. సర్టిఫికెట్లు లేక ఉద్యోగాలు వచ్చినవారికి అప్పులు చేసి పీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. సర్టిఫికెట్లు తెసుకోలేక కొందరు ఉద్యోగాలు కోల్పోతున్నారు. పీజీ కోర్సులలో సీట్లు పొందిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దీనితో ఉన్నత చదువులు ఆపిస్తున్నారు. ఉద్యోగాలు పొందిన వారు ఇతర దేశాలలో ఉద్యోగాలు వచ్చిన వారికి కూడా సర్టిఫికెట్లు లేక అడ్మిషన్లు తీసుకోవడం లేదు. దీనితో ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. విదేశాలకు చదువుకోవడానికి సీట్లు వచ్చిన వారికి కూడా సర్టిఫికెట్లు లేక వెళ్లలేకపోతున్నారు. ఇకా నిజాం కాలేజి, కోటి మెడికల్ కాలేజి, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ అధికారులు మహిళ యూనివర్సిటీ అధికారులు కూడా విద్యార్థుల వద్ద ఫీజులు కట్టివరకు అడ్మిషన్లు ఇవ్వడం లేదు. విశేషం ఏమిటంటే సెకండ్ ఇయర్ అడ్మిషన్లకు 26. హజ్రత్ సయ్యద్కూడా యూనివర్సిటీ అన్ని కాలేజీలలో ప్రభుత్వ కాలేజిలు పీజులు కట్టి వరకు అడ్మిషన్ ఇవ్వడం లేదు. కోర్సు పూర్తి చేసిన 6 లక్షల మంది వారి సర్టిఫికెట్లు కాలేజీలో పెట్టుకున్నారు. పీజులు కడితేనే సర్టిఫికెట్స్ ఇస్తామని అంటున్నారు. విద్యార్థులను వేదిస్తున్నారు. యూనివర్సిటీ కాలేజీలు ప్రభుత్వ కాలేజీలు కూడా ఫీజులు వసూలు చేయడం ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించడం అవుతుంది. ఇది చాల అన్యాయం. ఒక వైపు ముఖ్యమంత్రి ఫీజుల బకాయిలు ఇస్తామని ప్రకటిస్తున్నారు. ఒకవైపు ఫీజుల కోసం సర్టిఫికెట్లు అపవద్దని హైకోర్టు తీర్పు చెప్పింది. సర్టిఫికెట్లు విద్యార్థులకు ఆపవద్దని ఒకవైపు ప్రభుత్వ ఉత్తర్వులు - హైకోర్టు -సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నవి. కానీ కాలేజీలో వాటిని ధిక్కరించి విద్యార్థులను వేధిస్తున్నాడు. ప్రైవేటు డిగ్రీ, జూనియర్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ కాలేజీలో కోర్సులు పూర్తిచేసిన 6 లక్షల మందికి కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ప్రైవేట్ కాలేజిలు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. ప్రభుత్వ యూనివర్సిటీ కాలేజీ కుడా సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. ఫీజులు కట్టించుకున్తున్నారు. ప్రభుత్వాన్ని నుంచి పీజుల బకాయిలు వచ్చిన తర్వాత సర్టిఫికెట్లు ఇస్తామని చెబుతున్నారు. లేదా పీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకెళ్ళమని చెబుతున్నారు దీని వలన పేద కులాల వారు ఆర్థిక స్తోమత లేక ఫీజులు కట్టలేక స్తోమత సర్టిఫికెట్లు తీసుకోవడం లేదు. దీని మూలంగా చదివిన పరీక్షలు పాస్ అయిన లక్షలాది మంది విద్యార్ధుల డిగ్రీ, ఇంజనీరింగ్, ఇతర కోర్సు వారు సర్టిఫికెట్ల రాక ఉద్యోగ అవకాశాలు ఉన్నత విద్యా అవకాశాలు కోల్పోతున్నారు.
స్కాలర్షిప్లకు, ఫీజుల రియంబర్స్మెంట్కు బడ్జెట్ లేదని, అందుకే చెల్లించడం లేదని ముఖ్యమంత్రి పదేపదే అనడం సరికాదు. అన్ని స్కీములకు బడ్జెట్ ఉంటుంది. చదువకునే విద్యార్థులకు స్కాలర్షిప్ల ఫీజులకు బడ్జెట్ లేదా! ఇది సరికాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 34 నెలలు గడుస్తుంది. 34 నెలల కాలంలో ఏడు లక్షల కోట్లు ప్రభుత్వ ఆదాయం పన్నుల రూపంలో, భూముల అమ్మకాల వలన కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ల నుంచి ప్రభుత్వానికి వచ్చాయి. అలాగే వివిధ బ్యాంకుల నుంచి ఇతర సంస్థల నుంచి 4 లక్షల కోట్లు తెచ్చారు. దాదాపు 11 లక్షల కోట్లు ఆదాయం వస్తే చదువుకునే విద్యార్ధులకు 8 వేల కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఫీజులు ఇవ్వడానికి డబ్బులు లేవా? ఒక్కొక్క కాంట్రాక్టర్లకు ప్రభుత్వం పనులు చేసిన వారికి వేల కోట్లు పాత బకాయిలు చెల్లించారు. కానీ 14 లక్షల మంది చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజులు చెల్లించడానికి డబ్బు లేదా? ఇది అన్యాయం కాదా? విద్యార్ధుల భవిష్యత్తు ముఖ్యం కాదా! పీజులు, స్కాలర్షిప్ స్కీము వలన సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఇదొక పెట్టుబడి పధకం ఈ పథకం వలన సమాజంలో పెద్ద మార్పు వచ్చింది. ఎలాంటి షరతులు లేకుండా ఫీజుల బకాయిలు, స్కాలర్ షిప్పులు 8 వేల కోట్లు వెంటనే చెల్లించాలి. పాత పద్ధతి ప్రకారం ఫీజుల స్కీం కొనసాగించాలి. విద్యార్ధుల వద్ద అడ్మిషన్ల సమయంలో ఫీజులు వాసులు చేయరాదు. కాంగ్రెస్ ఎన్నికల వాగ్దాన ప్రకారం కాలేజీ కోర్సులు చదివే విద్యార్థుల ఫీజులు పూర్తిగా చెల్లించాలి. కాలేజీ కోర్సులు చదివే విద్యార్థుల స్కాలర్షిప్లులను ఆంధ్రప్రదేశ్ మాదిరిగా ప్రతి విద్యార్థికి 5వేల నుంచి 20 వేలకు పెందాలి.
ఈ భారీ ప్రదర్శనలో శ్రీనివాస్, రాజేష్, నరేష్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.