ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తాజానిపై సైబర్ దాడి
సూర్య అంతర్జాతీయ డెస్క్: ఇటలీ విదేశాంగ మంత్రి మరియు ఉప ప్రధాని ఆంటోనియో తాజానిని లక్ష్యంగా చేసుకుని ప్రొ-రష్యన్ హ్యాకర్లు సైబర్ దాడికి పాల్పడ్డారు. ఆయనకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు డార్క్ వెబ్‌లో లీక్ చేసినట్లు స్వయంగా తాజాని ప్రకటించారు. ఉక్రెయిన్‌కు ఇటలీ ప్రభుత్వం అందిస్తున్న సైనిక మరియు మానవతా సహాయం పట్ల కక్షగట్టినందుకే ఈ సైబర్ దాడులకు పాల్పడినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటనతో తన కుటుంబసభ్యులకు మరియు తనకు కొత్త ముప్పులు, బెదిరింపులు ఎదురవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సైబర్ దాడిని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అధికారుల గోప్యమైన సమాచారాన్ని దొంగిలించి డార్క్ వెబ్‌లో విక్రయించే ప్రయత్నాలను తీవ్రమైన విషయంగా పరిగణించాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి తాజానీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ బెదిరింపులకు ఎలాంటి పరిస్థితుల్లోనూ తలవంచబోమని, ఉక్రెయిన్‌కు మద్దతుగా ఇటలీ తన విధానాన్ని కొనసాగిస్తుందని తాజాని తేల్చిచెప్పారు. దేశ రక్షణ కోసం ప్రభుత్వ సంస్థలు మరింత పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.