ర్యాగట్లపల్లీ గ్రామంలో నూతన ఆసరా పెన్షన్ పత్రాల పంపిణీ
సూర్య- బిక్కనూర్ : మండలంలోనీ ర్యాగట్లపల్లీ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత ఆసరా పెన్షన్ పత్రాలను శుక్రవారం టిపిసిసి ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నూతన చేయూత పెన్షన్లను అర్హులైన ప్రతి ఒక్కరికి పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. రానున్న రోజులలో మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగన్నగారి నరేందర్ రెడ్డి,గ్రామ సర్పంచ్ అకిటి భాగ్యమ్మ నిలంరెడ్డి, ఉప సర్పంచ్ సాయన్న,వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు,రాజు, సంతోష్, సాయికుమార్,మాజీ ఎంపీటీసీ గుడిసె సంజీవులు,నాగి రమేష్, లబ్ధిదారులు గ్రామ కాంగ్రెసు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు