BREAKING
పోటీ నుంచి తప్పుకున్న రాంజీ యశ్ రాజ్ ఫిల్మ్స్ తొలి హారర్ చిత్రంలో వరుణ్ ధావన్.. దర్శకత్వం ఎవరిదంటే? రెండు ద్విచక్ర వాహనాలు డి... ఒకరు మృతి న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌కు గుర్నూర్ బ్రార్ ఎంపిక.. కుల్దీప్ యాదవ్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం సాండ్‌పేపర్ వివాదంపై డేవిడ్ వార్నర్ సంచలన ఆరోపణలు.. స్టార్క్, లయన్, హేజిల్‌వుడ్‌లను విచారించలేదంటూ క్రికెట్ ఆస్ట్రేలియాపై ఫైర్ 10వ తరగతి ఫలితాలు పై ప్రత్యేక దృష్టి టీ20 ఫార్మాట్‌లో వ్యూహాత్మక మార్పులే కీలకం.. కర్ణాటక యువ బ్యాటర్ స్మరన్ రవిచంద్రన్ ఆసక్తికర వ్యాఖ్యలు దివ్య కుటుంబానికి అండగా ఉంగుటూరు ఎమ్మెల్యే, జనసేన నాయకులు యాదవోలులో కేంద్ర బృందం పర్యటన ఘనముగా గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం ఆర్థిక ప్రమాదాలను నివారించడానికి క్రమమైన వడ్డీ రేట్ల పెంపే ఉత్తమం జెన్సన్ హువాంగ్ లేకపోతే కీలక ఒప్పందాలను కోల్పోనున్న ఎన్విడియా 73 ఏళ్ల నిరీక్షనకు తెరదించుతూ న్యూజిలాండ్‌పై అద్భుత విజయం సాధించిన వేల్స్ జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి అమెరికాలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం

రూరల్ మండలం నుంచి భారీ జనసమీకరణ -సీఎం సభకు 10 వేల మందితో కాంగ్రెస్ శ్రేణుల తరలింపు

Select Suryaa Now
రూరల్ మండలం నుంచి భారీ జనసమీకరణ  -సీఎం సభకు 10 వేల మందితో కాంగ్రెస్ శ్రేణుల తరలింపు

సిద్దిపేట రూరల్,; : ఈ నెల 19న సిద్దిపేటలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సభకు సిద్దిపేట రూరల్ మండలం నుంచి సుమారు 10 వేల మందితో భారీగా తరలివెళ్లి విజయవంతం చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.శనివారం మండలంలో నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మండల పరిధిలోని గ్రామాలకు 800 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు, సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.4 కోట్ల నిధులు విడుదల చేసినట్లు వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల మద్దతు ఉందని, ముఖ్యమంత్రి సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుర్రం అంజిరెడ్డి, గరిపల్లి రాములు,ఆత్మ కమిటీ డైరెక్టర్ అంజిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కోడారి మల్లారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రీక్కల మహేందర్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు గరిపల్లి వెంకటి,పుల్లూరు గ్రామ శాఖ అధ్యక్షుడు పుల్లూరి కనకయ్య గౌడ్,శ్రీనివాస్ రెడ్డి, బండి శివకుమార్, రమేష్, రఘుపతి, దుర్గయ్య, యాదగిరి, బాబు తదితరులు పాల్గొన్నారు.