BREAKING
ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండవ సాధారణ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పుూర్తి *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* అన్వీల్ అయిన అనీత్ పద్దా బర్త్‌డే పార్టీ అరుదైన చిత్రాలు.. అహాన్ పాండే, అలియా భట్ సందడి బిచ్కుంద ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు కొత్త సెన్సార్ బోర్డు నిబంధనలపై ఉత్కంఠ.. చిత్రనిర్మాణ ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్న మేకర్స్ పేదల సొంతింటి కల నిజం చేసిన ప్రజా ప్రభుత్వం దిల్ సే షూటింగ్‌లో ప్రాణాలు కాపాడిన షారుఖ్ ఖాన్.. నటి మీతా వశిష్ట ఆసక్తికర జ్ఞాపకాలు "విజయ్"నగర ఏలిక.... అవనాపు భార్గవి ఇక.... ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధుల నిర్వహణలో పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి - ఎన్నికల కమిషన్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ విధులు నిర్వహించాలి* *డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. ఏ. సిరి* ఉత్తరాఖండ్‌లో తీవ్రరూపం దాల్చిన కేదార్‌తాల్‌ ట్రెకర్స్ రెస్క్యూ ఆపరేషన్ నేడు మండల జిల్లా ప్రాదేశికఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి. తెల్లవారుజామునే సంచలన పాటను విడుదల చేసిన సల్మాన్ ఖాన్.. యుద్ధ చిత్రంలో ఈ రొమాంటిక్ సాంగ్ ఏంటని అభిమానుల్లో గందరగోళం నన్ను గెలిపించండి... మీ రుణం తీర్చుకుంటా..! రంగారెడ్డి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి మోరీ గేట్ మార్కెట్‌లో 7000 కిలోల కల్తీ కోవా ధ్వంసం.. సీఎం రేఖా గుప్తా నవంబర్ 5న కర్నూలు జిల్లాలోని అన్ని బ్యాంకులకు స్థానిక సెలవు* *జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి*

*రోడ్డు వేయలేరా..బురదలోనే బతకాలా...?* *వైరా 11వ వార్డులో మాలపల్లి రహదారి అధ్వానం*. *వర్షం వస్తే బురద కష్టాలు..రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు* *పట్టించుకోని అధికారుల తీరుపై కాలనీవాసుల ఆవేదన

Select Suryaa Now
*రోడ్డు వేయలేరా..బురదలోనే బతకాలా...?*  *వైరా 11వ వార్డులో మాలపల్లి రహదారి అధ్వానం*.                  *వర్షం వస్తే బురద కష్టాలు..రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు*  *పట్టించుకోని అధికారుల తీరుపై కాలనీవాసుల ఆవేదన

*రోడ్డు వేయలేరా..బురదలోనే బతకాలా...?*

*వైరా 11వ వార్డులో మాలపల్లి రహదారి అధ్వానం*.                

*వర్షం వస్తే బురద కష్టాలు..రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు*

*పట్టించుకోని అధికారుల తీరుపై కాలనీవాసుల ఆవేదన*

వైరా రూరల్ (సూర్య న్యూస్):-

రోడ్డు వేయలేరా..బురదలోనే బతకాలా..? అంటూ వైరా మున్సిపాలిటీ 11వ వార్డు సోమవరం ఎస్సీ కాలనీ (మాలపల్లి) ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్నప్పటికీ తమ కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రహదారి పూర్తిగా బురదమయంగా మారి నడవడానికి కూడా వీలులేని దుస్థితి నెలకొంది.
రోడ్డుపై అడుగడుగునా గుంతలు, నిలిచిన వర్షపు నీరు, పేరుకుపోయిన బురదతో కాలనీవాసుల రాకపోకలు కష్టంగా మారాయి. ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదం ఉండగా, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళల్లో ఈ మార్గంలో ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు.
అత్యవసర సమయాల్లో ఆటోలు, ఇతర వాహనాలు సైతం కాలనీలోకి రావడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. ఏళ్ల తరబడి ఇదే సమస్య కొనసాగుతున్నా శాశ్వత పరిష్కారం చూపకపోవడంపై కాలనీవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్న తమకు కనీసం నడవడానికి అనువైన రహదారి కూడా లేకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే రహదారిపై గ్రావెల్ పోయించి తాత్కాలికంగా రాకపోకలకు అనుకూలంగా మార్చాలని, శాశ్వత పరిష్కారంగా సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు చేపట్టాలని 11వ వార్డు సోమవరం ఎస్సీ కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యపై అధికారులు ఇకనైనా స్పందిస్తారా? లేక ప్రజలు బురద రోడ్డుపైనే ప్రయాణాలు కొనసాగించాలా? వేచి చూడాలి.