BREAKING
బీఈఎల్ టార్గెట్ ప్రైస్ పెంచిన మోతీలాల్ ఓస్వాల్ రెండవ త్రైమాసికంలో దుమ్మురేపిన బీఎస్‌ఈ సంవత్ 2083 దీపావళి స్టాక్ పిక్స్: ఆనంద్ రాఠీ రికమండేషన్స్ రెండవ త్రైమాసికంలో దుమ్మురేపిన అపోలో హాస్పిటల్స్ ఒకే శరీరంలో ఇద్దరు మనుషులు.. ఆసక్తికరంగా రాకేష్ వర్రె 'మాయ లేడీ' ట్రైలర్ ఎన్నికల విధుల్లో 11 వేల మంది సిబ్బంది, 3 వేల మంది పోలీసుల నియామకం - జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల జర్మనీ మార్కెట్‌లో ఎలాన్ మస్క్ టెస్లా హవా రేణిగుంటలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్ల తనిఖీ మెగాస్టార్ చిరంజీవి 'కాకా' సినిమా థియేట్రికల్ హక్కులపై భారీ చర్చ.. రూ. 70 కోట్ల టార్గెట్! నార్త్ అమెరికా కాఫీ యూనిట్‌ను విక్రయించనున్న క్రాఫ్ట్ హేంజ్ ఇరాన్ యుద్ధం, వాణిజ్య విధానాలపై ప్రపంచ దేశాల ఉత్కంఠ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'టైసన్ నాయుడు' నుంచి అదిరిపోయే మాస్ సాంగ్ అప్‌డేట్ ప్రమాద బాధితుడు రమణయ్యను పరామర్శించిన టిడిపి నాయకులు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఊహించని పరిణామం రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం కోహెడ ఏఎంసి చైర్మన్ బోయిని నిర్మల జయరాజు

ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండవ సాధారణ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పుూర్తి *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి*

Select Suryaa Now
ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండవ సాధారణ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పుూర్తి    *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి*

 

కర్నూలు, నవంబర్ 4:నవంబర్ 5 వ తేదీన నిర్వహించనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని  జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి తెలిపారు.

జిల్లాలో మొత్తం 432 ఎంపీటీసీ స్థానాలకు గాను 74 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 368 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నామన్నారు. అదే విధంగా 26 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుందన్నారు. జడ్పీటీసీ స్థానాలకు 97 మంది, ఎంపీటీసీ స్థానాలకు 907 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు. జిల్లాలో మొత్తం 12,50,166 మంది గ్రామీణ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారన్నారు. వీరిలో 6,21,167 మంది పురుషులు, 6,28,834 మంది మహిళలు, 165 మంది ఇతర ఓటర్లు ఉన్నారన్నారు. నవంబర్ 7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు.

జిల్లా వ్యాప్తంగా 648 ప్రాంతాల్లో మొత్తం 1,432 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ర్యాంపులు తదితర కనీస ప్రాథమిక సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు..  వీటిలో 299 అతి సున్నితమైన పోలింగ్ కేంద్రాలు, 398 సున్నితమైన పోలింగ్ కేంద్రాలు, 735 సాధారణ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు.  పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా పర్యవేక్షించేందుకు 697 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, 735 పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీ ఏర్పాటు చేశారన్నారు. సున్నితమైన, అతి సున్నితమైన ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించేందుకు 255 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాల్లో జరిగే  ఓటింగ్ ప్రక్రియను సీసీ కెమెరాల ద్వారా తాను, ఎన్నికల సంఘం  పర్యవేక్షించనున్నట్లు కలెక్టర్ తెలిపారు..

ఎన్నికల నిర్వహణ కోసం 1,575 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,578 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 5,128 మంది ఇతర పోలింగ్ అధికారులు కలిపి మొత్తం 8,281 మంది పోలింగ్ సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. ఓట్ల లెక్కింపు కోసం 2,172 మంది సిబ్బందిని కేటాయించడం జరిగిందన్నారు..


*ఓటర్ స్లిప్ ఉన్నా లేకపోయినా సరే,  కానీ 20 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఉండాల్సిందే*

ఓటర్ స్లిప్ ఉన్నా లేకపోయినా సరే,  20 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి   మాత్రం ఓటరు చూపించాల్సి ఉందని, అందువల్ల ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన పాన్ కార్డు లాంటి 20  గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తెచ్చుకోవాలని, ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు..

ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టినట్లు కలెక్టర్ వెల్లడించారు.