BREAKING
ధర్మసాగర్ లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి నిరుపేద నాయీ బ్రాహ్మణులకు ఇంటి స్థలాలు ఇప్పించండి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి వినతి కార్పొరేటర్ నాగభూషణం దంపతులకు సన్మానం 19 న రూరల్ కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక అదే రోజు న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ల ఎన్నిక

రైతులు వారు తడి పంటలు వేసుకోవాలి వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్

Select Suryaa Now
రైతులు వారు తడి పంటలు వేసుకోవాలి వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్

రామయంపేట;రామాయంపేట మండలంలోని కోనాపూర్, దామరచెరువు గ్రామాల్లో ఎల్‌నినో వాతావరణ పరిస్థితులపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత యాసంగి సీజన్‌లో వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచించారు. మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు, ఆవాలు, నువ్వులు, కుసుమలతో పాటు ముఖ్యంగా ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి సారించాలని తెలిపారు.ప్రస్తుతం మొక్కజొన్న, జొన్న విత్తనాలు సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఆసక్తి గల రైతులు పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని మండల వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కోనాపూర్ సర్పంచ్ వెంకటరామిరెడ్డి దామరచెరువు సర్పంచ్ గీతాంజలి డానియల్ మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్, ఏఈఓ ప్రవీణ్‌తో పాటు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.