BREAKING
ఉపాధ్యాయ వృత్తికే-కళంకం అండర్-19 ఆసియా కప్ సెమీస్‌లో చెలరేగిన సెహ్వాగ్‌ తనయుడు.. అర్ధశతకంతో అదరగొట్టిన ఆర్యవిర్! ‎ఆరోగ్యాలనిచ్చే ' తాయిలం' సంపదలను పెంచే ఆకు- తమలపాకు జనాలకు శుభాలనిచ్చే తమలపాకు. నంబూరు–ఎర్రుపాలెం రైల్వే లైన్ భూసమీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా విద్యార్థులకు అభినందన ఒకవైపు గుంతలు బాబోయ్.. మరోవైపు దుర్వాసన! పూతలపట్టు నుండి పోలవరం వెళ్లే రోడ్డు పరిస్థితి ఇది.. ఇటుపక్క వెళ్లలేకపోతున్నాం మొర్రో అంటున్న వాహనదారులు, స్థానికులు అరంగేట్ర టెస్టులో సంచలనం సృష్టించిన పాకిస్తాన్ బౌలర్ సాకిబ్ ఖాన్.. అరుదైన రికార్డు నమోదు! రిటైర్డ్ వెటర్నరి డాక్టర్ రామకృష్ణ రెడ్డి మృతికి వెంకట శివుడు యాదవ్ సంతాపం లక్ష్మీపతి గూడెం లో ఉచిత పశు వైద్య శిబిరం నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో సంచలనం.. హ్యాట్రిక్‌తో పాటు రికార్డు నమోదు చేసిన సందీప్ లమిచానే! సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ.. జార్ఖండ్ జట్టు ప్రకటన, ఇషాన్‌ కిషన్‌కు దక్కని చోటు! మహిళా వర్సిటీలో విద్యార్థుల ఫీల్డ్ ట్రిప్ శభాష్ చంద్ర..! జనగణనను పకడ్బందీగా నిర్వహించండి లైఫ్‌సైన్సెస్ రంగంలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు.. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం.. లైఫ్‌సైన్సెస్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ మధ్య ఒప్పందం

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకంతో మరోసారి సత్ఫలితాలు

Select Suryaa Now
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకంతో మరోసారి సత్ఫలితాలు

తెలంగాణ బ్యూరో ప్రతినిధి :‎ తెలంగాణ ప్రాంతం నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు సివిల్ సర్వీసెస్‌లో  విజయం సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ సహకారంతో ప్రారంభించిన ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకం మరోసారి మంచి ఫలితాలను సాధించింది.  ఇటీవల విడుదలైన సివిల్స్ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులై 31 మంది అభ్యర్థులు తుది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు.

మెయిన్స్‌ కు ఎంపికైన 158 మందికి రూ. లక్ష చొప్పున ప్రోత్సాహకం

సింగరేణి సంస్థ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన తెలంగాణ ప్రాంత అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహకం అందించేందుకు రెండు నెలల క్రితం దరఖాస్తులను ఆహ్వానించింది. వచ్చిన దరఖాస్తుల్లో 158 మంది అర్హులైన అభ్యర్థులను గుర్తించి, ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున మొత్తం రూ.1.58 కోట్ల ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందించింది. ఈసారి ప్రోత్సాహక మొత్తాలను నేరుగా అభ్యర్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానాన్ని అమలు చేశారు. ఈ ఆర్థిక సహకారంతో అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు మరింత ఉత్సాహంతో సిద్ధమయ్యారు. వారిలో 31 మంది తుది ఇంటర్వ్యూకు ఎంపిక కావడం విశేషం.

ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి మరో రూ.లక్ష ఆర్థిక ప్రోత్సాహకం

తుది ఇంటర్వ్యూకు ఎంపికైన 31 మంది అభ్యర్థులకు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ త్వరలో ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున అదనపు ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందించనుంది. సివిల్స్ మెయిన్స్ లో ఉత్తీర్ణులై తుది ఇంటర్వ్యూకు ఎంపికైన తెలంగాణ బిడ్డలందరికీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. ఇంటర్వ్యూ దశకు చేరుకున్న అభ్యర్థులందరూ తుది పరీక్షలోనూ విజయం సాధించి తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఇప్పటికే 27 మందికి సివిల్స్ లో  విజయం

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకానికి సింగరేణి సంస్థ గత రెండేళ్లుగా తన కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల నుంచి ఆర్థిక సహకారం అందిస్తోంది. ఈ పథకం ద్వారా మొదటి ఏడాది ఏడుగురు, రెండో ఏడాది 20 మంది చొప్పున మొత్తం 27 మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్‌లో విజయం సాధించడం విశేషం. ఈ ఏడాది కూడా అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు తుది ఇంటర్వ్యూలో విజయం సాధించి సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావాలని, ఈ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించబోతున్నారని, ఈ మాక్ ఇంటర్వ్యూల నిర్వహణకు కూడా సింగరేణి సంస్థ తన సహకారాన్ని అందిస్తుందని సింగరేణి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి తెలిపారు.

వరంగల్ నుంచి అత్యధికంగా ఆరుగురు

ఈ ఏడాది తుది ఇంటర్వ్యూకు ఎంపికైన 31 మందిలో అత్యధికంగా వరంగల్ జిల్లా నుంచి ఆరుగురు ఉన్నారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నుంచి నలుగురు, హైదరాబాద్, జగిత్యాల జిల్లాల నుంచి ముగ్గురేసి, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల నుంచి ఇద్దరేసి చొప్పున ఎంపికయ్యారు. అదిలాబాద్, నారాయణపేట, సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున తుది ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. వీరిలో 18 మంది ఓబీసీ వర్గాలకు చెందిన వారున్నారు. ఎస్టీ అభ్యర్థులు ఇద్దరు, ఎస్సీ అభ్యర్థులు ముగ్గురు, 8 మంది జనరల్ అభ్యర్థులు ఉన్నారు.