BREAKING
జిల్లావ్యాప్తంగా రెండవ రోజు కొనసాగిన ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ – జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర చీరాలలో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ సస్పెన్షన్తో సరిపెడతారా? ఎన్నికల సంఘానికి నివేదించరా? జగిత్యాలలో అక్రమంగా రోడ్డు తవ్వకాలు బీరు సీసాతో మెడ పై పొడిచి, దాడి - ఐదుగిరి పై కేసు- కమ్మర్ పల్లి ఎస్ఐ వత్సవాయి మండలంలో ప్రశాంతంగా పోలింగ్.. కట్టుదిట్టమైన పోలీసు భద్రత నేడు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివస్.. నాలుగు నియోజకవర్గాల్లో ఏర్పాట్లు కలగొట్ల అభివృద్ధికి కృషి చేస్తా ● మంచం గుర్తుపై ఓటేసి గెలిపించండి ● సర్పంచ్ అభ్యర్థి చిట్రెడ్డి విమల సమసమాజ స్థాపన కోసం పోరాడిన వ్యక్తి పూలే భక్తి జ్యోతిని ఆర్పలేరు!...ధర్మాన్ని అణచలేరు.. భూమా అఖిలప్రియా దాష్టికానికి మహిళ మృతి రెండు బొలెరో వాహనాలు ఢీ నరసింగపురంలో భారీ అగ్ని ప్రమాదం పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి పిఠాపురం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్

ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

Select Suryaa Now
ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి కామారెడ్డి జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు.గురువారం రాజంపేట మండలం శివాయిపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రం నంబరు 160లో నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలనుకునే వారు, ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హులు ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాలను వినియోగించుకోవాలని తెలిపారు.ఓటర్ల జాబితాలో పేర్లు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని, అవసరమైన మార్పులు, చేర్పుల కోసం సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జానకి, మండల ప్రత్యేక అధికారి అపర్ణ, హార్టికల్చర్ అధికారి జ్యోతి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి సూర్యజి, డివిజన్ పంచాయతీ అధికారి శ్రీనివాస్, సర్పంచులు సంధ్య, బాబు, తదితరులు పాల్గొన్నారు.