పూలను పూజించే గొప్ప వేడుక బతుకమ్మ పండుగ : నందికంటి శ్రీధర్
మల్కాజిగిరి, మేజర్ న్యూస్: పూలను పూజించే గొప్ప వేడుక బతుకమ్మ పండుగ అని బీఆర్ ఎస్ రాష్ట్ర నేత, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ నందికంటి శ్రీధర్ అన్నారు. ఆదివారం మౌలాలి డివిజన్ పరిధిలోని భరత్ నగర్లో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకకు ఆయన గౌరవ అతిథిగా హజరై స్థానిక మహిళలతో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొని సద్దుల బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్ష లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అన్నారు. పండుగలను ప్రజలందరూ కలిసి మెలిసి జరుపుకుంటేనే సార్థకత లభిస్తుందన్నారు. ఈ వేడుకలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వంశీ ముదిరాజ్, మారెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఉస్మాన్, సునంద రావు,అన్నమ్మ, స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.