BREAKING
అసత్యంపై ఎల్లప్పుడూ సత్యమే గెలుస్తుంది: ద్వారక దసరా వేడుకల్లో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం! భారత విమానయాన రంగంలో రికార్డుల ప్రస్థానం: 2047 నాటికి 130 కోట్ల ప్రయాణికులే లక్ష్యం.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి! సంపద, విజ్ఞానం, శక్తి కలబోసిన భారత్‌గా తీర్చిదిద్దడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం: తజికిస్తాన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టీకరణ! కొద్ది వారాల్లోనే భారత్-అమెరికా చారిత్రక వాణిజ్య ఒప్పందం: యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన ప్రకటన! ఉగ్రవాదంపై మా భాగస్వామ్య దేశాలు జీరో టాలరెన్స్ చూపించాలి: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ.. తహవ్వుర్ రాణా అప్పగింతపై హర్షం! 'ఉడాన్' పథకానికి పదేళ్లు: దేశవ్యాప్తంగా 1.72 కోట్ల మందికి విమాన ప్రయాణం.. 687 రూట్లతో సామాన్యుడి సొంతమైన ఆకాశం! భారత్-న్యూజిలాండ్ చారిత్రక వాణిజ్య ఒప్పందం అమలు.. ఇరుదేశాల హర్షం! హరిహర క్షేత్రంలో ఘనంగా శమి పూజలు 2029 డిసెంబర్ 31 నాటికి పంజాబ్‌ను ‘నశా ముక్త్’గా మారుస్తాం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టమైన డెడ్‌లైన్! ఎన్నికలు రాగానే పంజాబ్ గుర్తొచ్చిందా?: అమిత్ షాపై భగవంత్ మాన్ ధ్వజం! కాలనేమి కూడా రాముడి నామాన్ని జపించేవాడు: అయోధ్యపై విపక్షాల దుష్ప్రచారంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర వ్యాఖ్యలు! మహారాష్ట్రలో ప్రభుత్వం మారాల్సిందే: దసరా ర్యాలీలో బీజేపీపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర ధ్వజం! అమెరికాలో 3 లక్షల వీసాల రద్దు.. నేరస్థులపై ఉక్కుపాదం! పాకిస్తాన్, సౌదీ అరేబియాతో చారిత్రక 'మక్కా రక్షణ ఒప్పందం': ధ్రువీకరణ కోసం పార్లమెంటుకు పంపిన టర్కీ ప్రభుత్వం! ఇంధన సంక్షోభంపై మాక్రాన్ వ్యూహం: గల్ఫ్ దేశాల నుంచి భారీగా డీజిల్ కొనుగోలు

ఏపీ హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ను కలిసిన పల్లెటి వెంకటేష్ నాయుడు..

Select Suryaa Now
ఏపీ హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ను కలిసిన పల్లెటి వెంకటేష్ నాయుడు..

పొదలకూరు, మేజర్ న్యూస్ :   నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కమ్మవారిపల్లె గ్రామానికి చెందిన పల్లెటి వెంకటేష్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్  ఛైర్మన్‌గా నియమితులైన విశ్రాంత న్యాయమూర్తి  జస్టిస్ మల్లావోలు సత్యనారాయణమూర్తిని విజయవాడలోని ఆయన స్వగృహంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాతో సమానమైన బాధ్యతలు కలిగిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్న జస్టిస్ సత్యనారాయణమూర్తికి పల్లెటి వెంకటేష్ నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన బాధ్యతల్లో వారు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రజలకు, బాధితులకు న్యాయం అందించడంలో విశేష సేవలు అందించాలని ఆకాంక్షించారు.
మానవ హక్కుల పరిరక్షణలో కమిషన్ మరింత సమర్థవంతంగా పనిచేస్తూ బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. న్యాయవ్యవస్థలో ఉన్న అపారమైన అనుభవంతో జస్టిస్ సత్యనారాయణమూర్తి ప్రజలకు విశేష సేవలు అందిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అలాగే తమ కుటుంబ సన్నిహితులైన జస్టిస్ సత్యనారాయణమూర్తిని కలవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని పల్లెటి వెంకటేష్ నాయుడు పేర్కొన్నారు.