ఎన్నికల విధులకు సన్నద్ధం కావాలి :ఆర్వో
చీపురుపల్లి మేజర్ న్యూస్:
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అధికారులు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని చీపురుపల్లి ఎన్నికల నిర్వహణ అధికారి ఎస్ తవిటి నాయుడు సూచించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల విధులకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లలో భాగంగా పిఓ, ఏపీవో, రూట్ ఆఫీసర్, బీర్వోలుతో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిందని, నవంబరు 3న పోలింగ్, నవంబరు 5న ఓట్ల లెక్కింపు జరగనుందన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. సమావేశంలో ఎంపీడీవో ఇప్పలవలస సురేష్, తహసీల్దార్ సంతోష్ కుమార్, ఎస్ ఐ ఉమా వెంకటేశ్వరరావు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
మధు, సూర్య చీపురుపల్లి, విజయనగరం జిల్లా