BREAKING
అనంతపురం మేయర్ పదవికి 29, డివిజన్లకు 460 నామినేషన్ల పరిశీలన పూర్తి.. మహిషాసుర మర్దనిగా అమ్మవార్ల దివ్య దర్శనం వెంకన్న సన్నిధిలో యానాం ఎమ్మెల్యే, మంత్రి మల్లాడి కృష్ణారావు దంపతులు ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా… స్థానిక సంస్థల ఎన్నికలు – మన ఓటు- మన బాధ్యత 21 నుండి ఎంపీటీసీ జెడ్ పి టి సి లకు నామినేషన్ లు. నీతి నిజాయితీకి చిరునామా.. సాయి కొండ సుమలత...! చెట్టుకు ఢీకొని ఇద్దరు యువ కార్మికులు దుర్మరణం దసరా శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి టిడిపిని వీడి వైసీపీలో చేరిక. అలియాబాద్ మున్సిపాలిటీలో ఘనంగా దసరా వేడుకలు నేడే ఇల్లందు ఫారెస్ట్ గ్రౌండ్‌లో దసరా ఉత్సవాలు – ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ల పరిశీలన నాటకీయ పరిణామాలపై న్యాయపోరాటం చేస్తం : మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆరు భాషల్లో ఘనంగా 'జయహో రామానుజ' విడుదల.. శ్రీరామానుజాచార్యుల జీవిత చరిత్ర ఆధారంగా విజువల్ వండర్! మెట్లకుంటలో ఘనంగా దుర్గామాత సామూహిక కుంకుమార్చన

అశోక విజయదశమి సందర్భంగా 100 మంది దమ్మ యాత్ర..

Select Suryaa Now
అశోక విజయదశమి సందర్భంగా  100 మంది దమ్మ యాత్ర..

సిద్దిపేట అర్బన్, మేజర్ న్యూస్ :నమో బుద్ధాయ.. జై భీమ్ నినాదాలతో సిద్దిపేట జిల్లా నుంచి నాగ్‌పూర్‌కు దమ్మ యాత్ర ప్రారంభమైంది. అశోక విజయదశమి, బౌద్ధ ధమ్మ స్వీకరణకు సంబంధించిన చారిత్రక ఘట్టాన్ని స్మరించుకుంటూ బుద్ధ విహార్ మైత్రి సంఘం సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ యాత్ర చేపట్టారు. సీనియర్ బౌద్ధ కార్యకర్త, బీఎస్ఐ రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాది ఉప్పర మల్లేశం నేతృత్వంలో ఒక బస్సు, రెండు కార్లలో సుమారు వందమంది బౌద్ధ ఉపాసకులు, ఉపాసికలు, బౌద్ధ అభిమానులు, అంబేడ్కర్‌వాదులు, ప్రజాస్వామికవాదులు నాగ్‌పూర్‌కు బయలుదేరారు.

బాబాసాహెబ్ చారిత్రక బౌద్ధ ధమ్మ దీక్షకు 70 ఏళ్లు

భారత రాజ్యాంగ నిర్మాత, బోధిసత్వ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 1956 అక్టోబర్ 14న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో లక్షలాది మంది అనుచరులతో కలిసి బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించారు. కుల వివక్ష, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం, మానవ గౌరవం వంటి విలువలతో కూడిన బౌద్ధ ధమ్మ మార్గాన్ని ఆయన ప్రజలకు చూపించారు. ఈ చారిత్రక ఘట్టానికి 2026 అక్టోబర్ 14తో 70 సంవత్సరాలు పూర్తయ్యాయి.

 సూర్య న్యూస్  : సిద్దిపేట అర్బన్,  దేవులపల్లి భూపతి

ఈ నేపథ్యంలో నాగ్‌పూర్‌లోని దీక్షాభూమిని సందర్శించి, బాబాసాహెబ్ అంబేడ్కర్ బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించిన చారిత్రక ఘట్టాన్ని స్మరించుకోవడం, ఆయన ఆశయాలను భావితరాలకు అందించడం దమ్మ యాత్ర ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

ప్రబుద్ధ భారత్ నిర్మాణమే లక్ష్యం

“భారతదేశాన్ని బౌద్ధమయం చేయడం నా అంతిమ లక్ష్యం” అనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సమానత్వం, మానవత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని యాత్ర నిర్వాహకులు పిలుపునిచ్చారు. బౌద్ధ ధమ్మంలోని శాంతి, కరుణ, ప్రజ్ఞా మార్గాన్ని ఆచరిస్తూ ప్రబుద్ధ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

బాబాసాహెబ్ చూపిన మార్గంలో నడుస్తూ ఆయన ఆశయాలను భావితరాలకు అందించడమే తమ లక్ష్యమని బుద్ధ విహార్ మైత్రి సంఘం సిద్దిపేట జిల్లా కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు.