ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ రేఖ వెంకట్ రెడ్డి
కంది;చేర్యాల గ్రామ ప్రజలకు గ్రామ సర్పంచ్ రేఖ వెంకట్ రెడ్డి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు నింపాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలందరూ ఐకమత్యంతో పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పండుగ ప్రతి కుటుంబంలో సంతోషాన్ని నింపాలని సర్పంచ్ రేఖ వెంకట్ రెడ్డి ఆకాంక్షించారు.