BREAKING
దసరా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట బందోబస్తు మెట్లకుంట దుర్గామాత ఉత్సవాల్లో పోలీసుల సేవలకు సలాం.. ఏఎస్ఐ జైపాల్ రెడ్డికి ఘన సన్మానం పశ్చిమ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేత వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ మైనార్టీలతో ఆత్మీయ సమావేశం హిందూపురంలో 50 మంది వైసీపీ నుండి టిడిపిలోకి చేరిక సలాం పోలీస్... - పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం - ఏ ఆపద వచ్చినా మొదట ఆశ్రయించేది పోలీసులనే - సంచలనం సృష్టించిన ఎస్పీ పరదేశి నాయుడు పై మావోల దాడి - అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం మెట్లకుంటలో వైభవంగా దుర్గామాత నిమజ్జన మహోత్సవం.. రూ.51 వేలకు లడ్డూ, రూ.30 వేలకు అమ్మవారి చీర వేలం సంగారెడ్డిలో దసరా వేడుకలకు భారీ ఏర్పాట్లు సిద్దిపేటకు యూనివర్సిటీనే నెక్స్ట్ టార్గెట్..! 16వ వార్డులో టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలి భవాని మాత యూత్ అసోసియేషన్‌కు ఐదేళ్లుగా చేవెళ్ల మహి చేయూత.. కాసుల మహేందర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన BMYA భారతీనగర్ డివిజన్‌లో ఘనంగా దసరా వేడుకలు ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు

అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్శన దుర్గాదేవి, వనదుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

Select Suryaa Now
అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్శన  దుర్గాదేవి, వనదుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

ఏలూరు, సూర్య న్యూస్:
నగరంలోని సత్రంపాడు శ్రీ సౌభాగ్యలక్ష్మి దేవి ఆలయంలో 40వ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు దుర్గాదేవి, వనదుర్గాదేవి అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
చిన్నారుల నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణ
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీపాద శ్రీవల్లభ కూచిపూడి నాట్య నిలయం ఆధ్వర్యంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. చిన్నారులు తమ అద్భుతమైన నృత్య ప్రతిభతో ఆహూతులను ఆకట్టుకున్నారు. భక్తి భావంతో సాగిన నృత్య ప్రదర్శనలు కార్యక్రమానికి ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి.

స్థానిక సెయింట్ తెరీసా పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న దండే చంద్రిక ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన హావభావాలు, అభినయంతో చంద్రిక ప్రేక్షకులను విశేషంగా అలరించింది. చిన్న వయసులోనే నృత్యంలో ప్రతిభను చాటుకోవడంపై పలువురు అభినందనలు తెలిపారు.

చిన్నారులను ఆశీర్వదించిన నాట్య గురువు మేదరమెట్ల శిరీష చిన్నారులను ఆశీర్వదించి, వారు కళారంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. చిన్నారుల్లో దాగి ఉన్న కళా ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాకారులు, భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని చిన్నారుల నృత్య ప్రదర్శనలను ఆస్వాదించారు.

రిపోర్టర్: దొరబాబు ఏలూరు ఏలూరు జిల్లా,