telangana
యాచారం గ్రామంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
బంట్వారం, మేజర్ న్యూస్ : మండల పరిధిలోని యాచారం గ్రామంలో సోమవారం హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని మహిళలు వివిధ రకాల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి వేడుకల్లో పాల్గొన్నారు.సంప్రదాయ బతుకమ్మ పాటలు, ఆటపాటలతో దుర్గామాత ప్రాంగణం సందడిగా మారింది. మహిళలు ఉత్సాహంగా బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ పండుగ సంబరాలను జరుపుకున్నారు. పూల పండుగ విశిష్టతను చాటుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని పలువురు పేర్కొన్నారు.
హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు గ్రామంలో పండుగ వాతావరణాన్ని నింపాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జ్యోతి సంజీవరెడ్డి, హిందూ ఉత్సవ సమితి సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, మహిళలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.