BREAKING
పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా స్మృతి పరేడ్ రిహార్సల్స్ రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ సేవలు స్ఫూర్తిదాయకం : డాక్టర్ స్వాతి చక్రపాణి మూడు జడ్పీటీసీలు టీడీపీకే.. ఎంపీపీ పదవుల్లో జనసేనకు ఒకటి, టీడీపీకి రెండు కూటమి ఐక్యతే విజయానికి పునాది.. అభివృద్ధి, సంక్షేమమే ఎన్నికల అజెండా-ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ భక్తిశ్రద్ధలతో దుర్గమ్మ అమ్మవారి కి ప్రత్యేక పూజలు అంతరాయం లేని విద్యుత్తును అందించాలి. విద్యుత్ శాఖఈ ఈ రామయ్య. చిన్నారి వినయ్ వైద్యానికి సీఎం సహాయనిధి భరోసా : ఎమ్మెల్యే జహా ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల ధర్నా శిబిరాన్ని సందర్శించిన డీఎంహెచ్ఓ -- 7వ రోజు కొనసాగిన రిలేదీక్షలు, నిరసన ర్యాలీ -- అంబేద్కర్, గాంధీజీ విగ్రహాలకు వినతి పత్రం జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు శ్రీచౌడేశ్వరి ఆలయంలో భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు క్రీడలతోనే యువతకు ఉజ్వల భవిష్యత్తు చెముడులంక ధనలక్ష్మి అమ్మవారికి టేకు పల్లకి బహుకరణ. జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్లకు పటిష్ట ఏర్పాట్లు : జిల్లా కలెక్టర్,ఎస్పీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సామల సందీప్ రెడ్డి కనీసం బియ్యం కొనుగోలు చెయ్యలేని పరిస్థితుల్లో నిరుపేదలు పోచారం డివిజన్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన గుగులోత్ గోవింద్ నాయక్

లక్ష్మీనరసింహస్వామి ఆలయ ధర్మకర్తపై దాడికి యత్నం

Select Suryaa Now
లక్ష్మీనరసింహస్వామి ఆలయ ధర్మకర్తపై దాడికి యత్నం

మంత్రాలయం రూరల్:  సూర్య ప్రతినిధి ;మండల పరిధిలోని మాధవరం గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ధర్మకర్త నర్సిరెడ్డిపై సోమవారం దాడికి యత్నం జరిగినట్లు ఆయన ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి ఆలయ ధర్మకర్తలు నర్సిరెడ్డి, సునీత విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమ సొంత అన్నదమ్ములైన శ్రీనివాసరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, పృథ్వీ తమపై దాడికి యత్నించారని ఆరోపించారు. కొంతకాలంగా తాము ఆలయ ధర్మకర్తలుగా కొనసాగుతున్నామని, తమ ఆధ్వర్యంలో ఆలయం అభివృద్ధి చెందుతోందని తెలిపారు. సుమారు రూ.30 లక్షలతో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఆలయ హుండీకి సంబంధించిన సుమారు రూ.35 వేల నగదును రామ్మోహన్‌రెడ్డి అక్రమంగా వినియోగించుకున్నారని వారు ఆరోపించారు. ఈ విషయంతో పాటు ఆలయ అభివృద్ధి నేపథ్యంలో ఏర్పడిన విభేదాల కారణంగానే తమపై కక్ష పెంచుకుని దాడికి యత్నించారని పేర్కొన్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన బ్యానర్‌ను చించివేశారని, అర్చకుడిని సైతం బెదిరించారని ఆరోపించారు. ఆలయ అర్చకుడి జీతాలను తామే చెల్లిస్తున్నామని తెలిపారు.
ఈ ఘటనపై మాధవరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు నర్సిరెడ్డి వెల్లడించారు. తమపై దాడికి యత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, పృథ్వీపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఆలయ నిర్వహణకు సంబంధించిన రోజువారీ ఖర్చులను సైతం తామే భరిస్తున్నామని తెలిపారు.
ఈ ఘటనపై పోలీసుల విచారణ అనంతరం వాస్తవాలు వెల్లడికావాల్సి ఉంది

నాగరాజు సూర్య రూరల్ ప్రతినిధి మంత్రాలయం కర్నూలు జిల్లా