BREAKING
శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి-సర్పంచ్ దాసరి రమేష్ ప్రజావాణికి ప్రజల స్పందన కరువు..! మండల ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు గీత పనివారాల సంఘం అధ్యక్షులుగా కుమారస్వామి కుష్టు వ్యాధి అనుమానితుల గుర్తింపు సర్వేకు ప్రజలు సహకరించాలి లండన్‌లో భారతీయ మహిళ దారుణ హత్య: అనుమానితుడిపై విచారణ తేదీ ఖరారు చేసిన బ్రిటన్ న్యాయస్థానం! రావణాసుర వధకు సర్వం సన్నద్ధం లింగాల ఘణపురం నూతన ఎస్సైగా కల్తి కిషోర్ బాధ్యతల స్వీకరణ ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌పై తప్పుడు ప్రచారం: సోషల్ మీడియా ఖాతాదారులపై కేసు నమోదు చేసిన డెహ్రాడూన్ పోలీసులు! సబ్‌స్క్రిప్షన్ ఉచ్చుల్లో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు: యూజర్ల అసహనం.. కఠిన చర్యలకు డిమాండ్, లోకల్‌సర్కిల్స్ సర్వేలో వెల్లడి! దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఖరారుకు అత్యంత సమీపంలో ఉన్నాం:మార్కో రుబియో సంచలన ప్రకటన. కొల్లేరు సంఘం పెద్దల నిరసన ఎన్నికల ప్రచారంలో వైసిపి అభ్యర్థి నల్ల రవి

పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా స్మృతి పరేడ్ రిహార్సల్స్

Select Suryaa Now
పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా స్మృతి పరేడ్ రిహార్సల్స్

*నారాయణపేట, సూర్యన్యూస్:*.  అక్టోబర్ 21న నిర్వహించనున్న పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణపేట జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్ హక్ ఆధ్వర్యంలో స్మృతి పరేడ్ రిహార్సల్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ విజయభాస్కర్ పరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పరేడ్‌లో పాల్గొని స్మృతి పరేడ్‌కు సంబంధించిన విధివిధానాలను సాధన చేశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ... విధి నిర్వహణలో భాగంగా దేశ భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజల రక్షణ, సమాజంలో శాంతిభద్రతల స్థాపన కోసం అమరవీరులు చేసిన సేవలు పోలీస్ శాఖకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని తెలిపారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని గౌరవప్రదంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. స్మృతి పరేడ్‌లో క్రమశిక్షణ, సమన్వయం, గౌరవ వందనం వంటి అంశాలను పక్కాగా సాధన చేసి, అమరవీరులకు ఘనంగా నివాళులర్పించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. విధి నిర్వహణలో పోలీస్ అమరవీరులు చూపిన ధైర్యసాహసాలు, అంకితభావం, సేవా స్ఫూర్తిని ప్రతి పోలీస్ సిబ్బంది ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.