ఎన్నికల ప్రచారంలో వైసిపి అభ్యర్థి నల్ల రవి
ఆరిలోవ, సూర్య: జీవీఎంసీ 17వ వార్డు వైసీపీ అభ్యర్థి నల్ల రవి కుమార్ హనుమంతువాక కొండవాలు ప్రాంతంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి తమ అమూల్యమైన ఓటు హక్కును ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని ప్రార్థించారు. గెలిచిన వెంటనే స్థానిక ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా పోరాడుతానని అన్నారు. ఈ కార్యక్రమం లో వైసిపి ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వార్డు ఇంచార్జి గూడపాటి విక్టర్ , బూత్ కన్వీనర్ లు పిట్టా రెడ్డి , బంధం శ్రీను , అనిల్ , భగత్ , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.