కనీసం బియ్యం కొనుగోలు చెయ్యలేని పరిస్థితుల్లో నిరుపేదలు
కైకలూరు, మేజర్ న్యూస్, నేడు రాష్ట్రంలో చిన్న ఉద్యోగులు, నిరుద్యోగులు, చిరు వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, పేద కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్యుడు కుటుంబాన్ని పోషించుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కనీసం బియ్యం కొనుగోలు చేయాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి పేద కుటుంబాలకు రాకూడదు.పేదలకు అండగా నిలిచేది ఎవరు? విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేది ఎవరు? మహిళలకు, నిరుద్యోగులకు, చిరు వ్యాపారులకు, పేద కుటుంబాలకు న్యాయం చేసేది ఎవరు? ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చే నాయకత్వాన్ని గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత. పేదల సంక్షేమం, మహిళల అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్తు, సామాన్యుల ఆర్థిక భరోసా కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వమే సరైన మార్గమని వైసీపీ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు పేర్కొన్నారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆలోచించి, ప్రజలకు మంచి చేసే నాయకత్వాన్ని గుర్తించి నిర్ణయం తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
రిపోర్టర్. ఎం రమేష్ కైకలూరు ఏలూరు జిల్లా