BREAKING
శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి-సర్పంచ్ దాసరి రమేష్ ప్రజావాణికి ప్రజల స్పందన కరువు..! మండల ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు గీత పనివారాల సంఘం అధ్యక్షులుగా కుమారస్వామి కుష్టు వ్యాధి అనుమానితుల గుర్తింపు సర్వేకు ప్రజలు సహకరించాలి లండన్‌లో భారతీయ మహిళ దారుణ హత్య: అనుమానితుడిపై విచారణ తేదీ ఖరారు చేసిన బ్రిటన్ న్యాయస్థానం! రావణాసుర వధకు సర్వం సన్నద్ధం లింగాల ఘణపురం నూతన ఎస్సైగా కల్తి కిషోర్ బాధ్యతల స్వీకరణ ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌పై తప్పుడు ప్రచారం: సోషల్ మీడియా ఖాతాదారులపై కేసు నమోదు చేసిన డెహ్రాడూన్ పోలీసులు! సబ్‌స్క్రిప్షన్ ఉచ్చుల్లో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు: యూజర్ల అసహనం.. కఠిన చర్యలకు డిమాండ్, లోకల్‌సర్కిల్స్ సర్వేలో వెల్లడి! దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఖరారుకు అత్యంత సమీపంలో ఉన్నాం:మార్కో రుబియో సంచలన ప్రకటన. కొల్లేరు సంఘం పెద్దల నిరసన ఎన్నికల ప్రచారంలో వైసిపి అభ్యర్థి నల్ల రవి

జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్లకు పటిష్ట ఏర్పాట్లు : జిల్లా కలెక్టర్,ఎస్పీ

Select Suryaa Now
జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్లకు పటిష్ట ఏర్పాట్లు : జిల్లా కలెక్టర్,ఎస్పీ


మదనపల్లె,మేజర్ న్యూస్ : అన్నమయ్య జిల్లాలో జరగనున్న జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా,పారదర్శకంగా,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్,జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశించారు.సోమవారం మదనపల్లి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి జిల్లాలోని డివిజనల్ స్థాయి అధికారులు,ఎస్డీపీవోలు,రిటర్నింగ్ అధికారులు,తహసీల్దార్లు,ఎంపీడీవోలు,పోలీస్ స్టేషన్‌ల ఎస్‌హెచ్‌వోలు,సీఐలు,ఇతర మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల సన్నద్ధత,నామినేషన్ కేంద్రాల ఏర్పాట్లు,భద్రతా చర్యలపై సమీక్షించారు.

నామినేషన్ కేంద్రాల్లో మౌలిక వసతులు పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణకు నిర్దేశించిన సమయానికి ముందే అన్ని కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు సిద్ధం చేయాలని ఆదేశించారు.నామినేషన్ కేంద్రాల వద్ద కాంపౌండ్ వాల్స్,గేట్లు,తాళాలు,బారికేడ్లు,ప్రవేశ మార్గాలు తదితర ఏర్పాట్లను పరిశీలించి,పెండింగ్‌లో ఉన్న పనులను మంగళవారం సాయంత్రంలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులు,ఎన్నికల సిబ్బంది,అనుమతి పొందిన వ్యక్తులకు మాత్రమే నిబంధనల మేరకు ప్రవేశం కల్పించాలని,అనవసరమైన జనసమూహాలు ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.నామినేషన్ల ప్రక్రియలో ప్రతి అధికారి తనకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని,ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

నిషేధాజ్ఞల అమలులో నిర్లక్ష్యం వద్దు

నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.సంబంధిత అధికారులు నిషేధాజ్ఞల అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు,వాటి గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు.

శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలి

జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియలో శాంతిభద్రతల పరిరక్షణ అత్యంత కీలకమని,ప్రతి పోలీస్ అధికారి అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.అధికార,ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారెవరైనా సరే,నామినేషన్ కేంద్రాల వద్ద అనవసరంగా గుమిగూడకుండా చూడాలని,ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.సమస్యాత్మక వ్యక్తులను ముందుగానే గుర్తించి,చట్టప్రకారం బైండోవర్ చర్యలు చేపట్టాలని,గతంలో వివాదాలు లేదా హింసాత్మక ఘటనలకు సంబంధించి కేసులు ఉన్న వ్యక్తులపై నిబంధనల మేరకు నిఘా ఉంచాలని పోలీస్,రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.నామినేషన్ కేంద్రాల వద్ద అవసరాన్ని బట్టి 100 మీటర్ల పరిధితో పాటు అదనపు బఫర్ జోన్ ఏర్పాటు చేసి,బారికేడ్ల ద్వారా జనసమూహాలను నియంత్రించాలని సూచించారు.ప్రతి కేంద్రం వద్ద స్థానిక పోలీస్ అధికారులు,తహసీల్దారులు,ఎంపీడీవోలు పరస్పర సమన్వయంతో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించాలని తెలిపారు.

వీడియో రికార్డింగ్,డ్రోన్లతో నిరంతర నిఘా

సున్నితమైన,సమస్యాత్మక ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి డ్రోన్లను వినియోగించి పరిస్థితులను పర్యవేక్షించాలని ఎస్పీ సూచించారు.ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలు,అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటే మొబైల్ కెమెరాల ద్వారా వీడియో రికార్డింగ్ చేసి,సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందించాలని ఆదేశించారు.ప్రతి బృందం తక్షణ స్పందన బృందంగా పనిచేస్తూ,అవసరమైన ఆధారాలను సేకరించి చట్టపరమైన చర్యలకు సహకరించాలని సూచించారు.

అధికారుల సమన్వయంతోనే సజావుగా ఎన్నికలు

ఎన్నికల నిర్వహణలో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని,విధుల్లో నిర్లక్ష్యం లేదా అలసత్వం ప్రదర్శించకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్,ఎస్పీ స్పష్టం చేశారు.నామినేషన్ల స్వీకరణ నుంచి భద్రత,జనసమూహాల నియంత్రణ,ఎన్నికల నిబంధనల అమలు వరకు ప్రతి అంశాన్ని ముందస్తు ప్రణాళికతో నిర్వహించాలని సూచించారు.ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేలా,అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ,ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యేలా అన్ని శాఖల అధికారులు సమష్టిగా కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ,సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి,డిఆర్ఓ వెంకటేష్,ఆర్డీవోలు శ్రీనివాస్,విజయలక్ష్మి,జడ్పీ సీఈవో లక్ష్మీపతి,డిప్యూటీ సీఈవో కేఎల్ ప్రభాకర్ రావు,డిపిఓ రాధమ్మ,డీఎస్పీలు,సీఐలు,తాసిల్దార్లు,ఎంపీడీవోలు,జిల్లాస్థాయి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి