గత అభివృద్ధిని చూసి ఓట్లు వేయండి-- వైసిపి చైర్ పర్సన్ అభ్యర్థి రామ సీత
నర్సాపురం, మేజర్ న్యూస్ :గత వైసీపీ ప్రభుత్వ పాలనలో పట్టణంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిని కావలి రామ సీత పట్టణ ఓటర్ల అభ్యర్థించారు.
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి అవసరాలను తీర్చే వాలంటీర్లను కూటమి ప్రభుత్వం తొలగించిందని,కూటమి ప్రభుత్వానికి వాలంటీర్లు ఓటుతో బుద్ధి చెప్పాలి అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ముదునూరి ప్రసాదరాజు నాయకత్వాన్ని బలపరిచి పట్టణ అభివృద్ధికి సహకరించాలన్నారు.
సోమవారంపట్టణం లోని 32 వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రామ సీత గత వైసిపి ప్రభుత్వం లో పట్టణ అభివృద్ధికి మంజూరు చేసిన ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం ఇతర ప్రాంతాలకు తరలించింది అన్నారు. వాస్తవాలను ప్రజలు అర్థం చేసుకుని వైసిపి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కనీసం డంపింగ్ యార్డ్ సమస్య కూడా పరిష్కారం చేయలేని దుస్థితిలో ఉన్నారని విమర్శించారు.32 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని కొడమంచిలి సంతోషి రాణి. తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ ఇజ్రాయిల్ నరసాపురం పశ్చిమగోదావరి జిల్లా