BREAKING
శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి-సర్పంచ్ దాసరి రమేష్ ప్రజావాణికి ప్రజల స్పందన కరువు..! మండల ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు గీత పనివారాల సంఘం అధ్యక్షులుగా కుమారస్వామి కుష్టు వ్యాధి అనుమానితుల గుర్తింపు సర్వేకు ప్రజలు సహకరించాలి లండన్‌లో భారతీయ మహిళ దారుణ హత్య: అనుమానితుడిపై విచారణ తేదీ ఖరారు చేసిన బ్రిటన్ న్యాయస్థానం! రావణాసుర వధకు సర్వం సన్నద్ధం లింగాల ఘణపురం నూతన ఎస్సైగా కల్తి కిషోర్ బాధ్యతల స్వీకరణ ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌పై తప్పుడు ప్రచారం: సోషల్ మీడియా ఖాతాదారులపై కేసు నమోదు చేసిన డెహ్రాడూన్ పోలీసులు! సబ్‌స్క్రిప్షన్ ఉచ్చుల్లో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు: యూజర్ల అసహనం.. కఠిన చర్యలకు డిమాండ్, లోకల్‌సర్కిల్స్ సర్వేలో వెల్లడి! దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఖరారుకు అత్యంత సమీపంలో ఉన్నాం:మార్కో రుబియో సంచలన ప్రకటన. కొల్లేరు సంఘం పెద్దల నిరసన ఎన్నికల ప్రచారంలో వైసిపి అభ్యర్థి నల్ల రవి

శ్రీచౌడేశ్వరి ఆలయంలో భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు

Select Suryaa Now
శ్రీచౌడేశ్వరి ఆలయంలో భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు


మదనపల్లె,మేజర్ న్యూస్ : అన్నమయ్య జిల్లా కేంద్రం,మదనపల్లె పట్టణం,నీరుగట్టువారిపల్లెలో వెలసిన శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో దసరా (శరన్నవరాత్రి) ఉత్సవాలు,30వ వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా తొమ్మిదవ రోజైన సోమవారం శ్రీ చౌడేశ్వరి అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో  పంచామృతాభిషేకము,తీర్థప్రసాద వినియోగము,అమ్మవారికి ప్రత్యేక అలంకరణ,మహా మంగళహారతిని భక్తిశ్రద్దలతో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు పురాణం చంద్రశేఖర్,కమిటీ గౌరవ అధ్యక్షులు రామిశెట్టి నీలకంఠ,గౌరవ ఉపాధ్యక్షులతోపాటు కోశాధికారి రామిశెట్టి రత్నమయ్య,కార్యదర్శి బండి పవన్ కుమార్ మాట్లాడుతూ చౌడేశ్వరి ఆలయంలో భక్తిశ్రద్ధలతో శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు.విద్యుత్ దీపాలు,అనేక రకాల పుష్పాలతో ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించడం జరిగిందన్నారు.దాతల సహకారంతో ప్రతిరోజు భక్తులకు అల్పాహారం అందజేస్తున్నట్లు వారు తెలిపారు.శ్రీ చౌడేశ్వరి దేవి కృపాకటాక్షాలతో ప్రజలు ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.అదేవిధంగా భక్తులు నవరాత్రి ఉత్సవాలకు పెద్దఎత్తున హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించి చౌడేశ్వరి మాత కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో మోడెం వెంకటరమణ,మోడెం సిద్దప్ప,ఉప్పు రామచంద్ర,ఆర్.నీలకంఠ,బి.నాగరాజు,జి.లక్ష్మీనారాయణ,కె.వి నాగరాజు,ఆర్.కె మోహన్,రామిశెట్టి కృష్ణ,ఉప్పు శ్రీనివాసులు,ఆలయ కమిటీ సభ్యులు,తొగటవీర క్షత్రియ కుల బాంధవులు,భక్తులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి