క్రీడలతోనే యువతకు ఉజ్వల భవిష్యత్తు
*-ఎంఎల్‌పీఎల్ సీజన్-3 విజేతగా ఆర్కే ఆర్మీ*
నవాబుపేట సూర్య న్యూస్: యువత క్రీడల వైపు అడుగులు వేయాలని టీపీసీసీ కోఆర్డినేటర్ దారా భాస్కర్ పేర్కొన్నారు. మండల పరిధిలోని కొండాపూర్‌లో గత వారం రోజులుగా నిర్వహించిన మండల స్థాయి ప్రీమియర్ లీగ్ (ఎంఎల్‌పీఎల్) సీజన్-3 క్రికెట్ పోటీలు సోమవారం ఫైనల్‌తో ముగిశాయి.ఈ పోటీల్లో అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.ఫైనల్ పోటీలో ఆర్కే ఆర్మీ జట్టు విజేతగా నిలవగా,సాయి బాలాజీ జట్టు రన్నరప్‌గా నిలిచింది. విజేత జట్టుకు కప్పుతో పాటు రూ.70వేల నగదు బహుమతిని టీపీసీసీ కోఆర్డినేటర్ దారా భాస్కర్ అందజేశారు.రన్నరప్ జట్టుకు కప్పుతో పాటు రూ.40వేల నగదు బహుమతిని అందించారు. ఈ పోటీల్లో మండలవ్యాప్తంగా మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్నాయి.ఈ సందర్భంగా దారా భాస్కర్ మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని,మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని అన్నారు..ఈ క్రికెట్ పోటీల నిర్వహణకు బీఆర్‌ఎస్ యువ నాయకులు అభిమన్యు రెడ్డి ఆర్థిక సహాయం అందించారు.గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించడం ద్వారా యువతలోని ప్రతిభను వెలికితీయవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కొండాపూర్ సర్పంచ్ రాఘవేందర్,దాయపంతులపల్లి సర్పంచ్ కమలమ్మ కుమార్,బట్టోనిపల్లి తండా సర్పంచ్ స్వాతి రవీందర్ నాయక్,నాయకులు శాంతయ్య,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.