రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ సేవలు స్ఫూర్తిదాయకం : డాక్టర్ స్వాతి చక్రపాణి
మదనపల్లి,మేజర్ న్యూస్ : పట్టణంలోని బికేపల్లి నందు ఉన్నటువంటి ధాత్రి ఆనంద నిలయానికి దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని రిచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల రూ.10 వేలు విలువ చేసే నిత్యావసర సరుకులని వితరణ చేశారు.దీనిపై ధాత్రి ఆనంద నిలయంలోని వృద్ధులందరూ సంతోషాన్ని వ్యక్తపరిచి సరుకులు అందజేసిన డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్లకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ధాత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ స్వాతి చక్రపాణి మాట్లాడుతూ 30 మంది వృద్ధులతో నిర్వహిస్తున్న ధాత్రి ఆనంద నిలయం కష్టాలను తెలుసుకొని సాయం చేస్తున్న రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ రమేష్ నాథ్ లింగుట్ల వారి పౌండేషన్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.దాతల సహకారంతో ధాత్రి ఆనంద నిలయాన్ని దిగ్విజయంగా ముందుకు నడిపిస్తున్నామని,వృద్ధులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని మంచి వసతిని కల్పిస్తున్నామన్నారు.ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములవుతున్న దాతలకు రుణపడి ఉంటామన్నారు.అనంతరం డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల మాట్లాడుతూ ధాత్రి ఆనంద నిలయంలో వృద్ధులకు అద్భుతమైన సౌకర్యాలు అందిస్తున్నారని,అలసిన వృద్ధ జీవితాలకు డాక్టర్ స్వాతి చక్రపాణి బాసటగా నిలుస్తున్నారని కొనియాడారు.భవిష్యత్తులో ధాత్రి ఆనంద నిలయానికి మా ఫౌండేషన్ సహకారాలు సంపూర్ణంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ స్వాతి చక్రపాణి,ధాత్రి కో-ఆర్డినేటర్ శంకరయ్య,కుక్ అఖిల,సుబ్బులమ్మ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి