BREAKING
జామ్‌నగర్ రిఫైనరీకి యూఎస్ విదేశాంగ మంత్రి: ఇంధన వ్యూహమే ప్రధాన లక్ష్యం! సౌదీ అరేబియా రక్షణకు బ్రిటన్ కీలక నిర్ణయం: రాయల్ ఎయిర్‌ఫోర్స్ టైఫూన్ యుద్ధ విమానాల మోహరింపు! ఫ్రాన్స్ హింసాత్మక అల్లర్లు: మరిన్ని నగరాల్లో కర్ఫ్యూ విధింపుపై ప్రధాని ప్రకటన ఇరాన్ పాలకుల పాలనను అంతమొందించడమే మా లక్ష్యం: నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు.. భారత్-అమెరికా బంధం: వాణిజ్యం, భద్రతపై జైశంకర్ ఉన్నత స్థాయి భేటీ ఫారమ్ 173A అంటే ఏమిటి?: ప్రభుత్వ సెక్యూరిటీలపై పన్ను మినహాయింపుల కోసం సీబీడీటీ కొత్త నిబంధనలు! MSCI హెచ్చరికలతో కుప్పకూలిన ఇండోనేషియా స్టాక్ మార్కెట్.. 2031 నాటికి హార్ముజ్ జలసంధి ప్రాధాన్యత కనుమరుగు: హెచ్‌ఎస్‌బీసీ సీఈవో పండుగల వేళ ఈ-కామర్స్ జోరు: ఫ్లిప్‌కార్ట్ యాక్టివ్ యూజర్లలో సరికొత్త రికార్డు.. బోఫా (BofA) నివేదికలో కీలక వెల్లడి! పండుగల వేళ అమెజాన్ బంపర్ రిక్రూట్‌మెంట్: 3 లక్షల మందికి పైగా నియామకాలు.. ఫ్యాక్టరీ ప్రమాదం దర్యాప్తులో షెఫ్లర్ ఇండియా సీఈవో హర్ష కదమ్‌ను అదుపులోకి తీసుకున్న పూణే పోలీసులు! నేటి పంచాంగం 21 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –21 అక్టోబర్ 2026 అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్యెల్యే ఉగ్ర నరసింహారెడ్డి దసరా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట బందోబస్తు

ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల ధర్నా శిబిరాన్ని సందర్శించిన డీఎంహెచ్ఓ -- 7వ రోజు కొనసాగిన రిలేదీక్షలు, నిరసన ర్యాలీ -- అంబేద్కర్, గాంధీజీ విగ్రహాలకు వినతి పత్రం

Select Suryaa Now
ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల ధర్నా శిబిరాన్ని సందర్శించిన డీఎంహెచ్ఓ   -- 7వ రోజు కొనసాగిన రిలేదీక్షలు, నిరసన ర్యాలీ   -- అంబేద్కర్, గాంధీజీ విగ్రహాలకు వినతి పత్రం

*నారాయణపేట, సూర్యన్యూస్ :*    జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్.హెచ్.ఏం) ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు చేపడుతున్న రిలే దీక్షలు 7వ రోజు విజయవంతంగా జరిగాయి. సోమవారం నారాయణపేట శ్రీవివేకానంద మున్సిపల్ పార్క్ ముందు ధర్నా శిబిరం నుంచి ప్లకార్డులు పట్టుకుని పట్టణ పుర వీధుల గుండా నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్, స్వతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ విగ్రహాలకు వినతిపత్రం అందించారు. అంతకుముందు శిబిరంలో ఆ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు బిక్షపతి, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఉద్యోగులు సంవత్సరాల తరబడి కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాల్లో అభద్రత మధ్య పనిచేయాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం మానవనీయ కోణంలో ఆలోచించి ఎన్.హెచ్.ఎం ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షులు ప్రసాద్, నాయకులు డాక్టర్ నరసింహరావు సగరి, మోనేష్ చారి, కిరీటి, స్రవంతి, రామలింగమ్మ, వెంకటేష్, సత్యమ్మ, సౌందర్య, శ్వేతశ్రీ, భగవతి, శృతి, మాధవి, శ్రీలత, అనురాధ, విరోజ, నవీన, సౌందర్య, అర్చన, తిరుపతి, చందన, సత్యజ, ఇందిర, సావిత్రమ్మ, ఆశాజ్యోతి, రేణుక, మహేంద్ర, ఆశబీ, సంతోష, అజారుద్దీన్ పాల్గొన్నారు.

*ధర్నా శిబిరాన్ని సందర్శించిన డీఎంహెచ్ఓ..*
ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు గత ఏడు రోజులుగా నిరవధిక సమ్మె చేపడుతుండటంతో జిల్లాలో ఆరోగ్య సేవలు అంతరాయం ఏర్పడ్డాయి. ఈ క్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డిఎంహెచ్ఓ) డాక్టర్ జయచంద్రమోహన్ సోమవారం స్థానిక శ్రీవివేకానంద మున్సిపల్ పార్క్ దగ్గర ధర్నా శిబిరాన్ని సందర్శించి ఎన్ హెచ్ ఎం ఉద్యోగులతో మాట్లాడారు. న్యాయమైన డిమాండ్ల సాధనకు రాజ్యాంగ బద్దంగా పోరాటం చేయడం ఉద్యోగుల హక్కు అని, అదే విధంగా జిల్లాలోని గ్రామీణ ప్రాంత ఆస్పత్రులలో వైద్యులు, సిబ్బంది లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోవడం సంఘ నాయకుల కర్తవ్యమని, స్వచ్ఛందంగా విధులకు హాజరయ్యే సిబ్బందిని ఇబ్బంది పెట్టరాదని కోరారు. వీలనంత త్వరగా డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. క్లిష్టమైన వాటి విషయంలో ఉద్యోగులు సర్దుకుని పోవాలని కోరారు. అనంతరం ఉద్యోగ సంఘ నాయకులు వినతిపత్రం అందించారు.

– రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.