telangana
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సామల సందీప్ రెడ్డి
ఘట్‌కేసర్ రూరల్, మేజర్ న్యూస్ : మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్‌కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ ప్రజలకు బీఆర్‌ఎస్ యువ నాయకుడు, ఎస్‌వైఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి సామల సందీప్ రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. దసరా పర్వదినం ప్రతి ఇంటా సంతోషాల వెలుగులు నింపాలని, ప్రజలందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ ప్రజల్లో ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని మరింత పెంపొందించాలని కోరుకున్నారు. ప్రజలంతా ఉత్సాహంగా పండుగను జరుపుకోవాలని సందీప్ రెడ్డి అభిలషించారు.