భక్తిశ్రద్ధలతో దుర్గమ్మ అమ్మవారి కి ప్రత్యేక పూజలు
భక్తిశ్రద్ధలతో దుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు
మహిషాసురమర్దినిగా దర్శనమిచ్చిన అమ్మవారు
కందుకూరు, మేజర్ న్యూస్, (అక్టోబర్ 19): కందుకూరు మండలం కొత్తూరు గ్రామంలో దేవీ శరన్నవరాత్రుల తొమ్మిదవ రోజు సందర్భంగా సోమవారం దుర్గమ్మ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు.
గ్రామ సర్పంచ్ మండల కృష్ణ దంపతులు, పాత్రికేయులు తోకల శ్రీనివాస్ గౌడ్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పురోహితులు కుంకుమార్చన కార్యక్రమాన్ని చేపట్టారు. అమ్మవారి కృపతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని సర్పంచ్ మండల కృష్ణ ఆకాంక్షించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మండల కృష్ణ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
టి శ్రీనివాస్,మేజర్ న్యూస్.