మహిషాసుర మర్దనిగా అమ్మవార్ల దివ్య దర్శనం
అవనిగడ్డ, మేజర్ న్యూస్: దివిసీమలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తొమ్మిదో రోజు సోమవారం అవనిగడ్డలోని రాజరాజేశ్వరి, కంచి కామాక్షి, వాసవి, లంకమ్మ అమ్మవార్ల ఆలయాలతో పాటు మండల పరిధిలోని పులిగడ్డ, మోదుమూడి, వేకనూరు ప్రాంతాల్లో అమ్మవార్లను మహిషాసుర మర్దని దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గీతా మందిరంలో రాజ్యలక్ష్మి అమ్మవారిని ధనలక్ష్మి దేవిగా అలంకరించి కుంకుమార్చనలు, విశేష పూజలు చేశారు. పలు ఆలయాల్లో వేదమంత్రోచ్ఛారణలు, అష్టోత్తర శతనామావళి, లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆయా ఆలయాల కమిటీలు భక్తులకు ఏర్పాట్లు పర్యవేక్షించాయి.✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.