దసరా శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి
ఉమ్మడి జిల్లా ప్రాంత ప్రజలు దసరా వేడుకలను ఘనంగా జరుపుకోవాలి
రంగారెడ్డి : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని తాండూరు, వికారాబాద్ ప్రాంత ప్రజలకు శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి విజయదశమి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కులమతాలకు అతీతంగా ఐకమత్యంతో, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. విజయదశమి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు చేకూరాలని పట్నం మహేందర్ రెడ్డి ఆకాంక్షించారు.
దసరా పండుగ ప్రజల మధ్య సోదరభావాన్ని, ఐక్యతను పెంపొందించాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగను జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు.
(రంగారెడ్డి, మేజర్ న్యూస్)