అనంతపురం మేయర్ పదవికి 29, డివిజన్లకు 460 నామినేషన్ల పరిశీలన పూర్తి..
(అనంతపురము, కార్పొరేషన్ మేజర్ న్యూస్..)
అనంతపురం నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికలు 2026లో భాగంగా మేయర్ పదవికి దాఖలైన 29 నామినేషన్లు, 62 డివిజన్లకు సంబంధించి 460 నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జస్వంత్ రావు వెల్లడించారు. ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టగా, అనంతరం ఎన్నికల నిబంధనల మేరకు పరిశీలన నిర్వహించినట్లు తెలిపారు. మేయర్ పదవికి 13 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, డివిజన్ల వారీగా తెలుగుదేశం పార్టీ నుంచి 202, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 173 నామినేషన్లు వచ్చినట్లు వివరించారు.