వెంకన్న సన్నిధిలో యానాం ఎమ్మెల్యే, మంత్రి మల్లాడి కృష్ణారావు దంపతులు
ఆత్రేయపురం మేజర్ న్యూస్ కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామివారిని యానాం ఎమ్మెల్యే, పుదుచ్చేరి ప్రజాపనుల శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో, వేదమంత్రాల నడుమ ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈయనకు అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు ఆలయ . చైర్మన్ ముదునూరి వెంకటరాజు ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు మంత్రి మల్లాడి కృష్ణారావు దంపతులను శేషవస్త్రంతో సత్కరించి, స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ వేంకటేశ్వరస్వామివారి విశిష్టతను వివరించారు.