*జిల్లా కలెక్టర్‌ను కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు*
సంగారెడ్డి;సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఐఏఎస్‌ను సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.అనంతరం తెలంగాణ వీరయోధుడు, దివంగత పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి, వర్ధంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వ వేడుకలుగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, ఈ నెల 22న నిర్వహించనున్న పండుగ సాయన్న జయంతి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌తో పులిమామిడి రాజు చర్చించారు.జయంతి వేడుకలను ఘనంగా, గౌరవప్రదంగా నిర్వహించేందుకు సభా వేదిక ఏర్పాటు, పూలమాలలతో నివాళులర్పించడం, వేదిక అలంకరణ, ప్రచార కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ తదితర ఏర్పాట్లకు జిల్లా యంత్రాంగం తరఫున సహకారం అందించాలని కలెక్టర్‌ను కోరారు.తెలంగాణ చరిత్రలో పండుగ సాయన్నకు ప్రత్యేక స్థానం ఉందని, ఆయన సేవలు, పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేసేలా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ వేడుకల్లో ముదిరాజ్ సంఘం నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు జనార్ధన్‌తో పాటు పిట్టల రమేష్, మామిళ్ల ఆనంద్, రాజేష్, బుస్స సాయి, బస్వరాజ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.