BREAKING
16వ వార్డులో టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలి భవాని మాత యూత్ అసోసియేషన్‌కు ఐదేళ్లుగా చేవెళ్ల మహి చేయూత.. కాసుల మహేందర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన BMYA భారతీనగర్ డివిజన్‌లో ఘనంగా దసరా వేడుకలు ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు 85వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి గెలుపునకు బొండా ఉమా ప్రచారం హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు. ఖమ్మంలో జమ్మిబండపై ప్రత్యక్షమైన స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ సత్తుపల్లిలో ఆధునిక వైద్య సేవలకు మరో ముందడుగు.. ‘శస్త్ర హాస్పిటల్’ ప్రారంభం*మంత్రి తుమ్మల ఎమ్మెల్యేమట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం మండల పరిధి పుల్లపాడు MPTC అభ్యర్థిగా మురాల ఫణికుమార్ వైసీపీకి షాక్ - టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు: కోట మైసమ్మ అమ్మవారికి, జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు శ్యామల బేకరీ ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో వైసీపీలో చేరిక

డబ్బాకుపల్లి–పెంటేలవారిగూడెం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెంటేల స్వప్న ఎమ్మెల్యే తాతయ్య సహకారంతో అభ్యర్థిత్వం ప్రకటన

Select Suryaa Now
డబ్బాకుపల్లి–పెంటేలవారిగూడెం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెంటేల స్వప్న  ఎమ్మెల్యే తాతయ్య సహకారంతో అభ్యర్థిత్వం ప్రకటన

 డబ్బాకుపల్లి–పెంటేలవారిగూడెం ఎంపీటీసీ స్థానానికి కూటమి అభ్యర్థిగా శ్రీమతి పెంటేల స్వప్నను ప్రకటించారు. జగ్గయ్యపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) సహకారంతో వత్సవాయి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వడ్లమూడి రాంబాబు కూటమి తరఫున ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. రానున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెంటేల స్వప్న పేరును ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలతో ఎన్నికల్లో ముందుకు సాగేందుకు పార్టీ నాయకులు సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమంలో డబ్బాకుపల్లి పీఏసీఎస్ అధ్యక్షులు పెంటేల శ్రీనివాసరావు, పెంటేలవారిగూడెం నాయకులు పెంటేల శ్రీనివాసరావు, వత్సవాయి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వడ్లమూడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కూటమి అభ్యర్థి విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.