BREAKING
యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ 'భామ సుందరలో' కొత్త జానపద పాట! 29, 30 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. ఎలైట్ ఈగల్స్ క్రికెట్ టోర్నీకి డాక్టర్ మురుగన్ స్పాన్సర్‌షిప్ బతుకమ్మ వేడుకల్లో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ట్రెడిషినల్ లుక్.. ఫొటోలు వైరల్! ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి మంత్రి ఆనం ఆహ్వానం -బొమ్మిరెడ్డి రంగప్రవేశం పండుగ వేళ జోరుగా బెల్ట్‌ షాపులు.. కల్తీ మద్యం విక్రయాలపై నిఘా ఏదీ? వెంకటేష్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. 'మాలా' సాంగ్‌లో నివేదా పేతురాజ్ గ్లామర్ విందు! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కాగా అమలు చేయాలి రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక..... డబ్బాకుపల్లి–పెంటేలవారిగూడెం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెంటేల స్వప్న ఎమ్మెల్యే తాతయ్య సహకారంతో అభ్యర్థిత్వం ప్రకటన 46 వ డివిజన్ కార్పొరేటర్ గా విజయ 108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం అశోక విజయదశమి సందర్భంగా 100 మంది దమ్మ యాత్ర.. శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ......

దంపతులకు తీరని అభివృద్ధి దాహం.

Select Suryaa Now
దంపతులకు తీరని అభివృద్ధి దాహం.

 

గ్రామీణ రహదారులకు 174.325 కోట్లు మంజూరు.

కోదాడ నియోజకవర్గo లో 25. 40 కిలోమీటర్ల పల్లె రహదారుల అభివృద్ధికి 30 కోట్లు.

హుజూర్నగర్ నియోజకవర్గంలో 133.55 కిలోమీటర్ల పల్లె రహదారులకు 144. 32 లక్షలు.

పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వం.


హర్షం వ్యక్తం చేస్తున్న పల్లె ప్రజలు.


కోదాడ (మేజర్ న్యూస్)సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టనుంది. రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే  పద్మావతి రెడ్డి ల కు అభివృద్ధి అనేది తీరని దాహం లా మారింది. వారి ప్రత్యేక చొరవ, కృషి తో రెండు నియోజకవర్గాల్లో  రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం  174 కోట్ల 32 లక్షల 50 వేల  నిధులను మంజూరు చేస్తూ పాలనాపరమైన అనుమతులు ఇస్తూ, 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సీఆర్‌ఆర్ పథకం కింద ఈ పనులను చేపట్టేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దానకిశోర్  558, 559 ద్వారా జీవోలు జారీ చేశారు.దీంతో గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు మారుమూల గ్రామాలు, గిరిజన తండాలను ప్రధాన రహదారులతో అనుసంధానం జరగనున్నట్లు మంత్రి కార్యాలయం నుండి సోమవారం ప్రకటన వెలుబడింది. రెండు నియోజకవర్గాలలో
13 మండలాల్లో  54 పనుల ద్వారా  156.95 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు మంజూరయ్యాయి.

కోదాడ నియోజకవర్గంలో____________________

కోదాడనియోజకవర్గంలోని 6 మండలాల్లో 9 రహదారి పనులకు 30 కోట్ల నిధులు మంజూరయ్యాయి. 25.40 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు.

అనంతగిరి మండలంలో_____________________
మీట్యా తండా నుంచి వసంతాపురం సీఏడీ రోడ్డు వరకు 1.10 కిలోమీటర్లకు 1.30 కోట్లు, పాలారం నుంచి పాలేరు వాగు వరకు 1.30 కిలోమీటర్ల రహదారికి 1.50 కోట్లు మంజూరయ్యాయి.

చిలుకూరు మండలంలో
_________________
శివాజీ ఫీల్డ్స్ నుంచి హుజూర్‌నగర్ ఆర్‌అండ్‌బీ రోడ్డు మీదుగా హనుమాన్ ఆలయం, జానకీనగర్ తండా వరకు 2 కిలోమీటర్లకు 2.30 కోట్లు, చిలుకూరు నుంచి ఆర్లగూడెం వరకు 3.90 కిలోమీటర్లకు రూ.4.80 కోట్లు కేటాయించారు.

కోదాడ మండలం లో_______________

కూచిపూడి ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి కాపుగల్లు మీదుగా మాతంగమ్మ చెరువు వరకు కిలోమీటరు రహదారి అభివృద్ధికి 1.30 కోట్లు మంజూరయ్యాయి.

మునగాల మండలంలో_______________________

కలకోవ నుంచి నారాయణగూడెం వరకు 3 కిలోమీటర్ల రహదారి అభివృద్ధికి3.45 కోట్లు మంజూరయ్యాయి.

మోతె మండలంలో
_________________
నామవరం నుంచి తిమ్మాపురం వరకు 5 కిలోమీటర్ల రహదారి అభివృద్ధికి 5.75 కోట్లు కేటాయించారు.

నడిగూడెం మండలంలో----------------------------------
వల్లాపురం నుంచి శ్రీరంగాపురం వరకు 3.90 కిలోమీటర్లకు 4.80 కోట్లు,సిరిపురం–వల్లాపురం బీటీ రోడ్డు నుంచి శ్రీరంగాపురం వరకు 4.20 కిలోమీటర్లకు 4.80 కోట్లు మంజూరయ్యాయి.

హుజూర్ నగర్ నియోజక వర్గంలో_____________________

హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో 45 రహదారుల నిర్మాణానికి 144.325 కోట్ల నిధులు మంజూరయ్యాయి. 131.55 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు  ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

చింతలపాలెం మండలంలో_______________________
శోభనాద్రిగూడెం ఆర్‌అండ్‌బీ సెంటర్ నుంచి అడ్లూరు–పీక్లానాయక్ తండా రోడ్డు మీదుగా పాత పీక్లానాయక్ తండా వరకు 2.50 కిలోమీటర్లకు 2.65 కోట్లు, చింతలపాలెం నుంచి చింత్రియాల ఆర్‌అండ్‌బీ రోడ్డు మీదుగా కొత్తగూడెం తండా వరకు 0.35 కిలోమీటర్లకు రూ.38 లక్షలు మంజూరయ్యాయి.

హుజూర్‌నగర్ మండలంలో
_________________
బూరుగడ్డ నుంచి హుజూర్‌నగర్ వరకు 4 కిలోమీటర్ల బీటీ రోడ్డుకు 4.20 కోట్లు, బూరుగడ్డ నుంచి కొత్త మంగాపురం మీదుగా గౌండ్లగడ్డ వరకు 4.50 కిలోమీటర్ల మెటల్ రోడ్డుకు 3.225 కోట్లు, బూరుగడ్డ నక్కగండి నుంచి బేతవోలు వరకు 5 కిలోమీటర్లకు 5.30 కోట్లు, మర్రిగూడెం నుంచి బూరుగడ్డ వరకు 1.50 కిలోమీటర్లకు 1.60 కోట్లు మంజూరయ్యాయి.

మఠంపల్లి మండలంలో______________________
హనుమంతులగూడెం నుంచి చెన్నాయిపాలెం వరకు 4 కిలోమీటర్లకు 5.20 కోట్లు, యాతవాకిళ్ల నుంచి అల్లీపురం వరకు 5 కిలోమీటర్లకు 5.20 కోట్లు, పెదవీడు - అవిరేనికుంట తండా రోడ్డు నుంచి లాలి తండా రోడ్డు వరకు కిలోమీటరుకు 1.10 కోట్లు, మంచ్యాతండా నుంచి దుబ్బలగట్టు వరకు 2 కిలోమీటర్లకు 2.10 కోట్లు మంజూరయ్యాయి.
చెన్నాయిపాలెం బ్రిడ్జి నుంచి వాగొడ్డు తండా వరకు 3 కిలోమీటర్లకు 3.30 కోట్లు, మంచ్యాతండా నుంచి లిఫ్ట్ రోడ్డు వరకు 3 కిలోమీటర్లకు 3.20 కోట్లు, చెన్నాయిపాలెం నుంచి గుండ్లపాడు వరకు 4 కిలోమీటర్లకు 4.30 కోట్లు కేటాయించారు.

అలాగే కాల్వపల్లి తండా నుంచి ఆర్‌ఏ మైసమ్మ దేవాలయం వరకు 4.50 కిలోమీటర్ల బీటీ రోడ్డుకు 4.65 కోట్లు, కాల్వపల్లి తండా నుంచి పెదవీడు వరకు 3 కిలోమీటర్లకు 3.10 కోట్లు, బక్కలచ్చు తండా నుంచి వ్యవసాయ భూముల వరకు 2 కిలోమీటర్లకు 2.10 కోట్లు, యాతవాకిళ్ల నుంచి చెన్నాయిపాలెం వరకు 4 కిలోమీటర్ల బీటీ రోడ్డుకు 4.20 కోట్లు మంజూరయ్యాయి.

మేళ్లచెరువు మండలంలో
_________________
మేళ్లచెరువు రోడ్డు నుంచి ఎర్రగట్టు తండా మీదుగా ఎర్రగట్టు  వరకు 6 కిలోమీటర్లకు 6.20 కోట్లు, రామాపురం నుంచి కోదాడ–రేవూరు పీడబ్ల్యూడీ రోడ్డు మీదుగా యతిరాజాపురం తండా వరకు 3.90 కిలోమీటర్లకు 4.10 కోట్లు మంజూరయ్యాయి.
కోదాడ–రేవూరు పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి మంగలికుంట తండా మీదుగా యతిరాజాపురం తండా వరకు 3.50 కిలోమీటర్లకు 3.70 కోట్లు, వేపలమాధారం నుంచి మఠంపల్లి రోడ్డు వరకు 7 కిలోమీటర్లకు 8.50 కోట్లు కేటాయించారు.

నేరేడుచర్ల మండలంలో
_________________
దిర్శించర్ల నుంచి ఎల్‌బీ నగర్ వరకు 4 కిలోమీటర్లకు 4.20 కోట్లు, మేడారం నుంచి అన్నారం వరకు 4 కిలోమీటర్లకు 4.60 కోట్లు, మేడారం నుంచి దాచారం వరకు 1.50 కిలోమీటర్లకు 1.70 కోట్లు, లాల్ లక్ష్మీపురం నుంచి పెంచికలదిన్నె వరకు 2.90 కిలోమీటర్లకు 3 కోట్లు కేటాయించారు.
ఎల్లారం నుంచి దాచారం వరకు 3.50 కిలోమీటర్లకు 3.60 కోట్లు, హుజూర్‌నగర్ ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి నర్సయ్యగూడెం వరకు 2 కిలోమీటర్లకు 2.20 కోట్లు, పెంచికలదిన్నె నుంచి ఫతేపురం వరకు 0.60 కిలోమీటర్లకు 70 లక్షలు మంజూరయ్యాయి.
పెంచికలదిన్నె గుడి నుంచి సోమారం వరకు 2.50 కిలోమీటర్లకు 2.60 కోట్లు, సోమారం నుంచి ఉట్లపల్లి వరకు 2 కిలోమీటర్లకు 2.70 కోట్లు, సోమారం నుంచి తక్కెళ్లపాడు వరకు 4 కిలోమీటర్లకు 4.80 కోట్లు, కల్లూరు నుంచి సోమారం వరకు 2 కిలోమీటర్లకు 2.20 కోట్లు, పాత ఫతేపురం రోడ్డు నుంచి చిల్లేపల్లి మేజర్ వరకు 0.60 కిలోమీటర్ల బీటీ రోడ్డుకు 65 లక్షలు మంజూరయ్యాయి.

గరిడేపల్లి మండలంలో
________________
తాళ్లమల్కాపురం నుంచి జెర్రిపోతులగూడెం వరకు 4 కిలోమీటర్లకు 4.80 కోట్లు, ముత్యాలనగర్ నుంచి కాచవారిగూడెం మీదుగా హుజూర్‌నగర్ బైపాస్ వరకు 3.80 కిలోమీటర్లకు 4 కోట్లు, కట్టవారిగూడెం నుంచి జెర్రిపోతులగూడెం వరకు 1.50 కిలోమీటర్లకు 1.55 కోట్లు కేటాయించారు.
సర్వారం నుంచి కీతవారిగూడెం వరకు 3.50 కిలోమీటర్లకు 4.25 కోట్లు, సర్వారం ఎస్సీ కాలనీ నుంచి రాజుల కాలువ వరకు కిలోమీటరుకు 1.10 కోట్లు, సర్వారం నుంచి తేకులవాగు వరకు 2.50 కిలోమీటర్లకు 3.10 కోట్లు మంజూరయ్యాయి.
సర్వారం నుంచి లింగగిరి రోడ్డు మీదుగా జిల్లెలగడ్డ వరకు కిలోమీటరుకు 1.15 కోట్లు, కొండాయి గూడెం నుంచి పర్రెడ్డిగూడెం వరకు 2 కిలోమీటర్లకు 2.40 కోట్లు, పర్రెడ్డిగూడెం సంఘ బంధం బిల్డింగ్ నుంచి సీతారాంపురం వరకు 2 కిలోమీటర్లకు 2.40 కోట్లు కేటాయించారు.

పాలకీడు మండలంలో._____________________
నర్లింగులగూడెం నుండి లిఫ్ట్  వరకు 1.80 కిలోమీటర్లకు 2.30 కోట్లు, మీగడంపహాడ్ తండా నుంచి మంచ్యాతండా లిఫ్ట్ వరకు 1.50 కిలోమీటర్లకు 1.70 కోట్లు, రాఘవాపురం నుంచి చెన్నాయిపాలెం ఆర్‌అండ్‌బీ రోడ్డు వరకు 3.60 కిలోమీటర్లకు 4.32 కోట్లు మంజూరయ్యాయి.

పల్లెలకు ప్రధాన రహదారులతో అనుసంధానం___________________

కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో మంజూరైన రహదారి పనులు పూర్తయితే గ్రామీణ ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. ముఖ్యంగా గిరిజన తండాలు, మారుమూల గ్రామాల నుంచి మండల కేంద్రాలకు రాకపోకలు సులభతరం కానున్నాయి.
రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు, విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు, గర్భిణులు, రోగులు అత్యవసర వైద్య సేవలు పొందేందుకు ఈ రహదారులు ఉపయోగపడనున్నాయి.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ల కృషితో వచ్చిన ఈ నిధులు పల్లె ప్రజల ప్రయాణాలను సులభతరం చేయడంతో పాటు కోదాడ, హుజూర్ నగర్ నియోజక వర్గాల గ్రామీణ అభివృద్ధికి బలమైన పునాది వేయనున్నాయి. రెండు నియోజకవర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా వారం రోజుల క్రితమే కోదాడ నుండి కట్ట కొమ్ముగూడెం మీదుగా ఆరెగూడెం వరకు డబల్ రోడ్డుకు 27 కోట్లు మంజూరైన విషయం తెలిసిందే.