BREAKING
అసత్యంపై ఎల్లప్పుడూ సత్యమే గెలుస్తుంది: ద్వారక దసరా వేడుకల్లో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం! భారత విమానయాన రంగంలో రికార్డుల ప్రస్థానం: 2047 నాటికి 130 కోట్ల ప్రయాణికులే లక్ష్యం.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి! సంపద, విజ్ఞానం, శక్తి కలబోసిన భారత్‌గా తీర్చిదిద్దడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం: తజికిస్తాన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టీకరణ! కొద్ది వారాల్లోనే భారత్-అమెరికా చారిత్రక వాణిజ్య ఒప్పందం: యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన ప్రకటన! ఉగ్రవాదంపై మా భాగస్వామ్య దేశాలు జీరో టాలరెన్స్ చూపించాలి: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ.. తహవ్వుర్ రాణా అప్పగింతపై హర్షం! 'ఉడాన్' పథకానికి పదేళ్లు: దేశవ్యాప్తంగా 1.72 కోట్ల మందికి విమాన ప్రయాణం.. 687 రూట్లతో సామాన్యుడి సొంతమైన ఆకాశం! భారత్-న్యూజిలాండ్ చారిత్రక వాణిజ్య ఒప్పందం అమలు.. ఇరుదేశాల హర్షం! హరిహర క్షేత్రంలో ఘనంగా శమి పూజలు 2029 డిసెంబర్ 31 నాటికి పంజాబ్‌ను ‘నశా ముక్త్’గా మారుస్తాం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టమైన డెడ్‌లైన్! ఎన్నికలు రాగానే పంజాబ్ గుర్తొచ్చిందా?: అమిత్ షాపై భగవంత్ మాన్ ధ్వజం! కాలనేమి కూడా రాముడి నామాన్ని జపించేవాడు: అయోధ్యపై విపక్షాల దుష్ప్రచారంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర వ్యాఖ్యలు! మహారాష్ట్రలో ప్రభుత్వం మారాల్సిందే: దసరా ర్యాలీలో బీజేపీపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర ధ్వజం! అమెరికాలో 3 లక్షల వీసాల రద్దు.. నేరస్థులపై ఉక్కుపాదం! పాకిస్తాన్, సౌదీ అరేబియాతో చారిత్రక 'మక్కా రక్షణ ఒప్పందం': ధ్రువీకరణ కోసం పార్లమెంటుకు పంపిన టర్కీ ప్రభుత్వం! ఇంధన సంక్షోభంపై మాక్రాన్ వ్యూహం: గల్ఫ్ దేశాల నుంచి భారీగా డీజిల్ కొనుగోలు

టిఫిన్ సెంటర్ యజమాని కుమార్తెకు ఎంబిబిఎస్ సీటు

Select Suryaa Now
టిఫిన్ సెంటర్ యజమాని కుమార్తెకు ఎంబిబిఎస్ సీటు

ప్రశంసలు కురిపిస్తున్న ప్రముఖులు.

పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్...
( కిరణ్ కుమార్ ఆరిక)

చిన్నపాటి టిఫిన్ సెంటర్ నడుపుకుంటున్న వారి కూతురు వైద్య విద్యలో సీట్ సాధించి శభాష్ అనిపించకుంది చదువుల సరస్వతి బజ్జురి అనూష. వారిది సాధారణ పేద కుటుంబం. విఎం బంజర్ గ్రామంలో తిరువూరు రోడ్డులో చిన్న టిఫిన్ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు బజ్జురి రాధాకృష్ణ, వరలక్ష్మి దంపతులు. వారి కుమార్తె బజ్జురి అనూష ఎంబిబిఎస్ లో సీటు సాధించింది. పెనుపల్లి మండలం విఎం బంజర్ గ్రామానికి చెందిన బజ్జురి రాధాకృష్ణ వరలక్ష్మి ఒక కుమారుడు, ఒక కుమార్తె అనూష ఉన్నారు. కుమార్తె అనూష నీట్ లో 430 ర్యాంకు సాధించింది. రెండవ కౌన్సిలింగ్లో సిఎంఆర్ కాలేజీలో ఎంబిబిఎస్ సీట్ పొంది తల్లితండ్రుల కలను తన లక్ష్యాన్ని సాధించింది. కుమారుడు కూడా చదువులో రాణిస్తూ బీటెక్ చదువుతున్నాడు. చదువులో శ్రద్ధ, ఉన్నత స్థానాలు, లక్ష్యాలను సాధించాలన్న పట్టుదల గ్రహించిన బజ్జురి దంపతులు చిన్నపాటి టిఫిన్ హోటల్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ మరో పక్క చదువులో పిల్లలను ప్రోత్సహించారు. అనూష బీసీ వెల్ఫేర్ సత్తుపల్లిలో 9.2 గ్రేడ్ తో  10వ తరగతి విద్యని, సోషల్ వెల్ఫేర్ బిఆర్ అంబేద్కర్ కాలేజీ ఖమ్మం లో ఇంటర్మీడియట్  961 మార్కులతో సాధించింది. 2026 నిట్ లో 430 ర్యాంక్ పొందింది. తల్లిదండ్రులను నమ్మకాన్ని నిజం చేస్తూ కుమార్తె  వైద్య విద్యలో సీటు సాధించింది. ఎంబిబిఎస్ సీట్ సాధించడం పట్ల కుటుంబ సభ్యులతో పాటు, మిత్రులు, పెనుబల్లి మండల ప్రముఖులు ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదేవిధంగా వైద్య విద్యలో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశీర్వదించారు.