బతుకమ్మ సంబరాల్లో సందడి చేసిన డాక్టర్ మట్ట దయానంద్
తుమ్మలపల్లి లో బతుకమ్మ సంబరాలు.
(కిరణ్ కుమార్ ఆరిక )
పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్.....
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండగని బతుకమ్మ పండగ భారతదేశానికి ఆదర్శమని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ అన్నారు. పెనుబల్లి మండలంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. బతుకమ్మ సంబరాల్లో డాక్టర్ మట్టా దయానంద్ పాల్గొన్నారు. పెనుపల్లి మండలం తుమ్మలపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈడ కమలాకర్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని బతుకమ్మలను పేర్చి కోలాటాలు, నృత్యాలతో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర నేత డాక్టర్ మట్ట దయానంద్ బతుకమ్మ సంబరాల్లో పాల్గొని భక్తులతో కలిసి కోలాటంఆడి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు కేసర శ్రీనివాస్ రెడ్డి, చీకటి రామారావు, ఈడా కమలాకర్, తుమ్మలపల్లి సర్పంచ్ బుడ్డియ్య, గూడూరు మాధవరెడ్డి, మాలోత్ రాధాకృష్ణ, నారూమల్ల వెంకటేశ్వర రావు, మేకతొట్టి కాంతయ్య, కర్రి సదా, భుఖ్య ప్రసాద్, కర్నాటి వీర భద్రారెడ్డి, పాకలపాటి సతీష్, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.