BREAKING
అసత్యంపై ఎల్లప్పుడూ సత్యమే గెలుస్తుంది: ద్వారక దసరా వేడుకల్లో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం! భారత విమానయాన రంగంలో రికార్డుల ప్రస్థానం: 2047 నాటికి 130 కోట్ల ప్రయాణికులే లక్ష్యం.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి! సంపద, విజ్ఞానం, శక్తి కలబోసిన భారత్‌గా తీర్చిదిద్దడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం: తజికిస్తాన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టీకరణ! కొద్ది వారాల్లోనే భారత్-అమెరికా చారిత్రక వాణిజ్య ఒప్పందం: యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన ప్రకటన! ఉగ్రవాదంపై మా భాగస్వామ్య దేశాలు జీరో టాలరెన్స్ చూపించాలి: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ.. తహవ్వుర్ రాణా అప్పగింతపై హర్షం! 'ఉడాన్' పథకానికి పదేళ్లు: దేశవ్యాప్తంగా 1.72 కోట్ల మందికి విమాన ప్రయాణం.. 687 రూట్లతో సామాన్యుడి సొంతమైన ఆకాశం! భారత్-న్యూజిలాండ్ చారిత్రక వాణిజ్య ఒప్పందం అమలు.. ఇరుదేశాల హర్షం! హరిహర క్షేత్రంలో ఘనంగా శమి పూజలు 2029 డిసెంబర్ 31 నాటికి పంజాబ్‌ను ‘నశా ముక్త్’గా మారుస్తాం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టమైన డెడ్‌లైన్! ఎన్నికలు రాగానే పంజాబ్ గుర్తొచ్చిందా?: అమిత్ షాపై భగవంత్ మాన్ ధ్వజం! కాలనేమి కూడా రాముడి నామాన్ని జపించేవాడు: అయోధ్యపై విపక్షాల దుష్ప్రచారంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర వ్యాఖ్యలు! మహారాష్ట్రలో ప్రభుత్వం మారాల్సిందే: దసరా ర్యాలీలో బీజేపీపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర ధ్వజం! అమెరికాలో 3 లక్షల వీసాల రద్దు.. నేరస్థులపై ఉక్కుపాదం! పాకిస్తాన్, సౌదీ అరేబియాతో చారిత్రక 'మక్కా రక్షణ ఒప్పందం': ధ్రువీకరణ కోసం పార్లమెంటుకు పంపిన టర్కీ ప్రభుత్వం! ఇంధన సంక్షోభంపై మాక్రాన్ వ్యూహం: గల్ఫ్ దేశాల నుంచి భారీగా డీజిల్ కొనుగోలు

శ్రీశ్రీశ్రీ దేవి అమ్మవారి ఆలయంలో వైభవంగా దుర్గాదేవి చండీ హోమం

Select Suryaa Now
శ్రీశ్రీశ్రీ దేవి అమ్మవారి ఆలయంలో వైభవంగా దుర్గాదేవి చండీ హోమం

అనపర్తి, మేజర్ న్యూస్. మండలంలోని, రామవరం గ్రామంలోని చెరువు వీధిలో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ దేవి అమ్మవారి ఆలయంలో 59వ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులపాటు నిర్వహించిన దుర్గా చండీ హోమ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగాయి. మహానవమి పర్వదినాన్ని పురస్కరించుకుని తొమ్మిదవ రోజు నిర్వహించిన ప్రత్యేక హోమ కార్యక్రమంలో గ్రామస్థులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ చెళ్ళపిళ్ళ త్రిమూర్తి శర్మ కుమారులు వెంకట శాస్త్రి, పవన్ శర్మల ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు ప్రతిరోజూ అమ్మవారికి విశేష పూజలు, దుర్గా చండీ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

 వేదమంత్రాల నడుమ జరిగిన హోమ కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. మహానవమి సందర్భంగా నిర్వహించిన చండీ హోమంలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి భక్తుల రాకతో పరిసర ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లిడి సురేంద్ర రెడ్డి దంపతులు, రామవరం గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ మండ సతీష్ రెడ్డి దంపతులు, పూర్వపు శివాలయ కమిటీ చైర్మన్ నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి (చిన్నబ్బు) దంపతులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వీరితో పాటు పలువురు గ్రామ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.తొమ్మిది రోజులపాటు భక్తిభావంతో నిర్వహించిన దుర్గా చండీ హోమ కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించాయి.