BREAKING
యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ 'భామ సుందరలో' కొత్త జానపద పాట! 29, 30 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. ఎలైట్ ఈగల్స్ క్రికెట్ టోర్నీకి డాక్టర్ మురుగన్ స్పాన్సర్‌షిప్ బతుకమ్మ వేడుకల్లో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ట్రెడిషినల్ లుక్.. ఫొటోలు వైరల్! ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి మంత్రి ఆనం ఆహ్వానం -బొమ్మిరెడ్డి రంగప్రవేశం పండుగ వేళ జోరుగా బెల్ట్‌ షాపులు.. కల్తీ మద్యం విక్రయాలపై నిఘా ఏదీ? వెంకటేష్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. 'మాలా' సాంగ్‌లో నివేదా పేతురాజ్ గ్లామర్ విందు! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కాగా అమలు చేయాలి రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక..... డబ్బాకుపల్లి–పెంటేలవారిగూడెం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెంటేల స్వప్న ఎమ్మెల్యే తాతయ్య సహకారంతో అభ్యర్థిత్వం ప్రకటన 46 వ డివిజన్ కార్పొరేటర్ గా విజయ 108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం అశోక విజయదశమి సందర్భంగా 100 మంది దమ్మ యాత్ర.. శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ......

*దుర్గామాత విగ్రహాల నిమజ్జన విషయములో పోలీస్ వారి హెచ్చరిక*

Select Suryaa Now
*దుర్గామాత విగ్రహాల నిమజ్జన విషయములో  పోలీస్ వారి హెచ్చరిక*

*మధిర టౌన్ ఎస్ హెచ్ ఓ దోమల రమేష్*

మధిర సూర్య మేజర్ న్యూస్ 
 

దుర్గామాత విగ్రహ నిమజ్జన కార్యక్రమాలనుసురక్షితంగా మరియు ప్రశాంతంగా నిర్వహించడానికి కమిటీ సభ్యులు మరియు నిర్వాహకులు తప్పనిసరిగా కొన్ని కీలకమైన జాగ్రత్తలు తీసుకోవాలని మధిర పట్టణ ఎస్ హెచ్ ఓ దోమల రమేష్ సూచించారు.
దేవీ శరన్నవరాత్రుల ముగింపు సందర్భంగా దుర్గామాత విగ్రహాల నిమజ్జనంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత, మరియు మతపరమైన భావాలు దెబ్బతినకుండా ఉండేందుకు హెచ్చరికలు జారీ చేశారు.నిమజ్జనం తర్వాత జలాశయాల్లో లేదా నది తీరాల్లో పాక్షికంగా మునిగిన, తేలియాడుతున్న లేదా విచ్ఛిన్నమైన దుర్గాదేవి విగ్రహాల ఫోటోలు, వీడియోలు తీయడం మరియు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం ప్రచారం చేయడం కఠినంగా నిషేధించబడిందని ఇటువంటి దృశ్యాలు భక్తుల మతపరమైన సెంటిమెంట్లను గాయపరిచే అవకాశం ఉన్నందున, ప్రజా శాంతికి భంగం కలగకుండా ఉండేందుకు బి.ఎన్.ఎస్  సెక్షన్ 163 కింద నిషేధం. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు.విగ్రహాల నిర్వాహకులు నిర్దేశించిన సమయాల్లోనే నిమజ్జన శోభాయాత్రను ముగించాలి ఊరేగింపుల్లో అనుమతించిన పరిమితికి మించి శబ్ద కాలుష్యం కలిగించే సౌండ్ సిస్టమ్స్ లేదా డీజేలను వాడకూడదు. రాత్రి సమయాల్లో నిర్ణీత గడువు దాటిన తర్వాత  మైకులు వాడటం నిషిద్ధం ప్రతి మండలి నిమజ్జన సమయంలో క్రమశిక్షణను కాపాడేందుకు,తోపులాటలు జరగకుండాచూసేందుకు తమ వాలంటీర్లను అందుబాటులో ఉంచాలి.
విగ్రహాల తరలింపు వాహనాల ఎత్తును బట్టి, దారిలో ఉండే విద్యుత్ వైర్ల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ షాక్‌ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని సూచించారు. శోభాయాత్ర మరియు నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో మద్యం సేవించడం, గొడవలకు దిగడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాంమన్నారు.

సీతారాం…సూర్య ఆర్సీ